ఉమెన్స్ డే రోజున అనసూయ కథనం.. హ్యాట్రిక్ ఖాయం!
ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కథనం. బీ నరేంద్రరెడ్డి, శర్మచుక్కా ఈ చిత్రానికి నిర్మాతలు. రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రను పోషించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్బంగా కథనం టీజర్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
ఈ సందర్బంగా నిర్మాత నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ... దర్శకుడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను నిర్మిస్తున్నాను. ఈ చిత్రంలో అనసూయ ఫుల్‌లెంగ్త్ రోల్ చేశారు. అనసూయ కేరీర్‌లొ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా ఉంది. మహిళా దినొత్సవం సందర్బంగా మార్చి8న టీజర్‌ను విడుదల చెస్తున్నాం అని అన్నారు.

దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ... ఇది నా మొదటి చిత్రం. క్షణం, రంగస్థలం అనంతరం కథనం చిత్రంతో అనసూయ హ్యాట్రిక్ కోట్టబొతున్నారు.ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. నరేంద్రరెడ్డి పంపిణిదారునిగా ఏ సినిమా చేసిన హిట్ అయింది. ఆయనది లక్కీ హ్యాండ్. నిర్మాతగా కూడా సక్సెస్ అవ్వడం గ్యారెంటీ. అని అన్నారు.
తెరవెనుక, తెర ముందు
నటీనటులు, సాంకేతికవర్గం
అనసూయ భరద్వాజ్, అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెన్నెలకిషోర్, పెళ్లి పృధ్వీ, సమీర్, ముఖ్తార్‌ఖాన్, రామరాజు, జ్యోతి తదితరులు
ప్రొడక్షన్ కంట్రోలర్: బాలాజీ శ్రీను,
ఎడిటర్: ఎస్.బి. ఉద్దవ్,
మ్యూజిక్: సునీల్ కశ్యప్,
ఆర్ట్ డైరెక్టర్: కె.వి.రమణ,
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: సతీష్ ముత్యాల,
లైన్ ప్రొడ్యుసర్: ఎమ్.విజయ చౌదరి,
నిర్మాతలు: బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజేష్ నాదెండ్ల,


Click it and Unblock the Notifications











