Anasuya Bharadwaj యాసిడ్ బాటిల్ పట్టిన అనసూయ.. ఏం జరిగిందంటే?
ఓ వైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా పాపులారిటీ తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. గతేడాది వాంటెడ్ పండుగాడ్, గాడ్ ఫాదర్ తదితర చిత్రాలతో అలరించిన అనసూయ ఈ ఏడాది కూడా అదే జోరు చూపించబోతుది. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండలో కీలక పాత్ర పోషించిన అనసూయ మరో సినిమాతో ఆకట్టుకోనుంది. ఆ సినిమానే అరి. విభిన్న పాత్రల కథగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఇందులో అందం కోసం అనసూయ యాసిడ్ బాటిల్ పట్టుకుని ఆసక్తి పెంచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మంగ్లీ పాడిన పాటకు..
పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా విజయం అందుకున్న డైరెక్టర్ జయ శంకర్. ఆయన తాజాగా అరి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. సినిమా టైటిల్ తోనే ఆసక్తి కలిగించిన ఆయన అరి ఫస్ట్ లుక్, ప్రచార వీడియోలతో మరింత క్యూరియాసిటీ పెంచారు. ఈ సినిమాలో చిన్నారి కిట్టయ్య అని సింగర్ మంగ్లీ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ లభించింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తరెకెక్కిన అరి సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.

ఆరు అవ లక్షణాలు..
అరిషడ్వర్గాలు అంటే కోరికలు అనే వాయిస్ తో మొదలైన అరి మూవీ ట్రైలర్ లో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల చుట్టూ తిరిగే కథల చూపించారు. ఒక మనిషి ఎలా బతకకూడతో ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది.
అరిషడ్వర్గాలుగా ఉన్న ఆరుగురికి ఉన్న కామన్ శత్రువు ఎవరు అనే ఆసక్తికర కథతో డైరెక్టర్ జయశంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతి మనిషిలో ఉండే ఆరు అవ లక్షణాల కారణంగా ఎంతగా దిగజారుతారు, 6 చెడు లక్షణాలతో ఎలా పతనం అవుతాడో ఇందులో ఆవిష్కరించనున్నారు.

అసూయ పడే పాత్రలో..
ఓవైపు కృష్ణ తత్వాన్ని చూపిస్తూ మరోవైపు ఆరుగురు తమ శత్రువులను ఎలా ఎదుర్కొంటారో చూపించనున్నారు. అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యర్, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, వైవా హర్ష ఆరుగురు కీలక పాత్రల్లో నటించారు. ఇందులో మరొకరి అందంపై జెలసీ పడే పాత్రలో అనసూయ నటించింది. తను ఎవరిని చూసి అసూయ పడుతుందో వారిపై యాసిడ్ పోసేందుకోసమే యాసిడ్ బాటిల్ పట్టుకున్నట్లు చూపించారు.

దారుణంగా రేప్ చేయాలి..
గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్ మరోసారి విలక్షణంగా కనిపించారు. ఓ అమ్మాయిని రేప్ చేయాలి.. అది కూడా దారుణంగా అని అన్నప్పుడు ఆయన చక్కటి నటనతో అలరించారు. అటాచ్ మెంట్ క్యారెక్టర్ లో సురభి ప్రభావతి ఆకట్టుకున్నారు. ఇక ప్రైడ్ గా సాయి కుమార్ మరోసారి పవర్ ఫుల్ గా కనిపించారు. కోపం ఉన్న వ్యక్తిగా శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్ క్యారెక్టర్ లో వైవా హర్ష వారి వారి పాత్రల్లో బాగా నటించారు. ఒక్కొక్క పాత్రను పరిచయం చేస్తూ సాగిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.
అనూప్ రూబెన్స్ సంగీతం..
ఈ ఆరుగురు పాత్రలే కాకుండా సుమన్, ఆమని, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐడ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి అరి చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.. శివశంకర్ వర ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. కాసర్ల శ్యామ్, వనమాలి సాహిత్యం, జి. అవినాష్ ఎడిటర్ గా, భాను, జీతు కొరియోగ్రాఫర్లుగా చేశారు.


Click it and Unblock the Notifications











