"పుష్ప 2" ఇలాగే చూడాలి... రంగమ్మత్త ఆ విషయంలో హర్ట్ అయ్యిందా?

ఇపుడు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ దగ్గర అంతా ఓ రేంజ్ లో వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా పేరు ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 అని చెప్పాలి. చాలాకాలం తర్వాత ఒక సిసలైన పాన్ ఇండియా చిత్రం.. అంతకు మించి భారీ సీక్వెల్ గా బాహుబలి, KGFలకి మించిన హైప్ లో పుష్ప2 వచ్చింది.

ఇలా సీక్వెల్స్ పర్వం ఇండియన్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో హిట్ కాగా ఇపుడు మరిన్ని సీక్వెల్స్ రాబోయే రోజుల్లో రానున్నాయి. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఇదే సీక్వెల్స్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా లేకపోలేవు. సరిగ్గా ఇపుడు పుష్ప 2 సీక్వెల్ విషయంలో కూడా ఇదే వినిపిస్తుంది. నిజానికి పుష్ప 1 కి పుష్ప 2 అనేది ఒక పర్ఫెక్ట్ సీక్వెల్ కాదు అని చాలా మంది అంటున్నారు.

anasuya shocking post on pushpa 2 sequel comments

పార్ట్ 2 కేవలం పలు ఎలివేషన్స్, కొన్ని సీన్స్ వరకే హైలైట్ అయ్యింది కాని కథ లేదు అంటూ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఈ సీక్వెల్‌పై నడుస్తున్న రచ్చలో ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కామెంట్స్ లేటెస్ట్ గా ఇపుడు వైరల్ గా మారాయి.

నాకు తెలీక అడుగుతున్నాను ఒక సీక్వెల్ అంటే మొదటి పార్ట్ కి కొనసాగింపుగా కదా అని అర్ధం. మరి ఆ పార్ట్ కి ఈ పార్ట్ కి పోలుస్తూ మాట్లాడ్డం సబబు కాదేమో అంటూ రంగమ్మత్త హితవు పలికింది. సీక్వెల్ అన్నాక ఒక ఫ్లోలో కదా చూడాలి తర్వాత ఏం జరిగింది అన్నట్టు అంటూ ఆమె వ్యాఖ్యానించింది. దీనితో పుష్ప 2 విషయంలో వస్తున్న ఆ కామెంట్స్ పట్ల రంగమ్మత్త కొంచెం హర్ట్ గాని అయ్యిందా అని అనిపిస్తుంది . కాగా పుష్ప 1లో కంటే పార్ట్ 2లో దాక్షాయణిగా అనసూయ ఉన్న కొంతసేపు కూడా అదరగొట్టింది.

అలాగే పలు కీలక సన్నివేశాల్లోనూ అనసూయ భాగం అయ్యింది. ఇది మాత్రమే కాకుండా దీనికి మించిన రోల్ ని దర్శకుడు సుకుమార్ తన గత చిత్రం "రంగస్థలం" లో ఆమెకి ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే పుష్ప సిరీస్‌లోనూ ఈమె చేసింది . కానీ రంగస్థలం ఇచ్చిన బ్రేక్ అయితే పుష్ప చిత్రాలు అనసూయకి ఇవ్వలేకపోయాయి అని చెప్పాలి. ఇదే కాకుండా అనసూయ ప్రస్తుతం పలు చిత్రాలు సహా టీవీ షోస్ లో కూడా పాల్గొంటుంది. మరి పుష్ప పార్ట్ 3లో ఆమె కనిపిస్తుందో లేదో అనేది మాత్రం చూడాలి. అయితే ఈ మూడో పార్ట్ మొదలు కావడానికి మాత్రం చాలా సమయం పట్టొచ్చు అని ఫిలింనగర్ టాక్.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X