సొంత కొడుకు అలా అనేసరికి కన్నీళ్లు ఆగలేదు.. యాంకర్ అనసూయ ఎమోషనల్ కామెంట్స్
బుల్లితెర జబర్దస్త్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్ ఎలాంటి కామెంట్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. రెగ్యులర్ గా గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు సమాజానికి సంబంధించిన పరిస్థితులపై కూడా ఆమె నిత్యం స్పందిస్తూనే ఉంటారు. ఇక ఇటీవల తన 9 ఏళ్ల కొడుకు అన్న మాటలకు అనసూయకు కన్నీళ్లు ఆగలేదట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

ఒకవైపు కరోనా మరోవైపు వర్షాలు
ప్రస్తుతం హైదరాబాద్ నగరం వర్షం ధాటికి గతంలో ఎప్పుడు చూడని నష్టాలను చూస్తోంది. రోడ్లు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఎన్నో విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు కరోనా మరోవైపు వర్షాలతో సాదారణ జనాల నుంచి స్టార్ సెలబ్రేటీస్ వరకు అందరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే విషయంపై అనసూయ వివరణ ఇచ్చింది.

తొమ్మిదేళ్ల కుమారుడన్న మాటలకు
కరోనా తరువాత వరదల ధాటికి తన కొడుకు ఈ విదంగా అనగానే కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పింది. అమ్మా.. నేను గతంలోకి వెళితే బావుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు కరోనా లేదు. ఇలాంటి వరదలు కూడా లేవు. నిజంగా భవిష్యత్తు కంటే ఆ రోజులే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయని అనిపిస్తోంది.. అంటూ తొమ్మిదేళ్ల తన కుమారుడు చెప్పినట్లు అనసూయ తెలిపారు.

ఏడుపొచ్చింది.. అనసూయ ఆవేదన
కొడుకు మాటలు వినగానే ఒక్కసారిగా నేను ఎడ్చేశానని తెలిపిన అనసూయ.. నిజంగా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో? భవిష్యత్తు తరాలకు మనం ఏం అందించాలని అనుకున్నాం.. అంటూ అనసూయ ఎమోషనల్ అవుతూ తన ట్విట్టర్ ఎకౌంట్ లో క్లియర్ గా వివరణ ఇచ్చింది. ఇక అనసూయా చేసిన ట్వీట్ పై కొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
Recommended Video

బ్రహ్మాజీ ట్వీట్ పై విమర్శలు
అనసూయ అనే కాకుండా చాలా మంది సెలబ్రిటీలు కరోనా, అలాగే వరద ఉద్రిక్తతపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఇటీవల వరదలలో తన ఇంటి ముందు భారీగా వరద నీరు చేరినట్లు కామెంట్ చేశాడు. అలాగే మంచి బోటు ఉంటే సజెస్ట్ చేయండి కొనుక్కుంటానని ట్వీట్ కూడా చేశాడు. అయితే ఆ ట్వీట్ పై విమర్శలు కూడా వచ్చాయి. చాలా మంది వరదల్లో కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో వెటకారంగా ట్వీట్ చేయడం దారుణమని అంటున్నారు.


Click it and Unblock the Notifications











