Anasuya HBD Pawan Kalyan: పవన్​ కల్యాణ్​కు అనసూయ బర్త్​డే విషెస్.. నా ప్రేమను అంటూ..

ఓ వైపు యాంకర్​గా, మరోవైపు నటిగా పాపులారిటీ తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. ఇటీవలే వాంటెడ్​ పండుగాడ్​ మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉంది. సినిమాలే కాకుండా సోషల్​ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్​గా ఉంటుంది. హాట్​గా ఫొటోలతో అట్రాక్ట్​ చేసే ఈ బ్యూటిఫుల్ యాంకర్​ ఘాటు కామెంట్స్​తో ట్రోలింగ్​ బారిన పడుతుంది. ఇటీవల లైగర్​పై పరోక్షంగా కామెంట్​ చేసి ట్రోలింగ్​కు గురైన విషయం తెలిసిందే. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్​కు డిఫరెంట్​గా బర్త్​డే విషెస్​ చేసింది ఈ రంగమ్మత్త.

ఈ పేరు వింటే చాలు..

ఈ పేరు వింటే చాలు..

పవన్​ కల్యాణ్​.. ఈ పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల్లో విజిల్స్ సౌండ్​ మోత మోగిపోతుంది. ఏ హీరో ఫంక్షన్​ అయినా సరే.. పవన్ కల్యాణ్​ అని పేరు వింటే చాలు.. రచ్చ రచ్చే. మెగాస్టార్​ చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయమయ్యాడు పవన్​ కల్యాణ్. తర్వాత తనదైన నటన, మ్యానరిజంతో అశేష అభిమానులను సంపాదించుకుని పవర్​ స్టార్​గా ఎదిగాడు పవన్ కల్యాణ్.

51వ పడిలోకి..

51వ పడిలోకి..

అలాంటి పవన్ కల్యాణ్​ బర్త్​డే నేడు (సెప్టెంబర్​ 2). పవర్ స్టార్ పవన్​ కల్యాణ్​ 51వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సామాన్యులతో పాటు టాలీవుడ్​ సెలబ్రిటీలు, ప్రముఖులు బర్త్​డే విషెస్​ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే యాంకర్, నటి అనసూయ ట్విటర్ వేదికగా పవన్​ కల్యాణ్​కు బర్త్​డే విషెస్​ తెలిపింది.

 నా ప్రేమను పంపుతున్నాను..

నా ప్రేమను పంపుతున్నాను..

''స్ఫూర్తిదాయక పోరాట యోధుడు, అద్భుతమైన లీడర్​ పవన్​ కల్యాణ్​ సర్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు నా ప్రేమను, పాజిటివ్​ వైబ్స్​ను పంపిస్తున్నాను. సంతోషంగా ఉండండి'' అంటూ అనసూయ భరద్వాజ్​ తన ట్విటర్​లో రాసుకొచ్చింది.

ఒక్క కామెంట్​తో..

ఒక్క కామెంట్​తో..


ఇదిలా ఉంటే ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రంపై పరోక్షంగా కామెంట్లు విమర్శల పాలైంది అనసూయ భరద్వాజ్. ఈ ఒక్క కామెంట్​తో నెటిజన్లు అనసూయను తెగ ట్రోలింగ్ చేశారు. ఆంటీ అంటూ పిలవడం, అది హ్యాష్​ట్యాగ్​ ట్రెండింగ్​లో సోషల్ మీడియాలో దూసుకెళ్లడం వంటివి కూడా జరిగాయి.

నా పిల్లల ఫ్రెండ్స్​ వరకే..

నా పిల్లల ఫ్రెండ్స్​ వరకే..

ఇక ఆంటీ అని పిలవడంపై కూడా అనసూయ స్పందించింది. ఇందుకు సమాధానంగా నా పిల్లల ఫ్రెండ్స్​, మా చుట్టాల్లో పిల్లల వరకు నేను ఆంటీనే. కానీ ఇక్కడ మీరంత చూసేది నా వయస్సును. నన్ను హేళన చేసే పని. మీ ఉద్దేశాలు వేరు. అది తప్పు. అది అగౌరవ పరచడం అని అంటున్నాను అని అనసూయ తెలిపింది.

 ముధుర వాణిగా..

ముధుర వాణిగా..


కాగా సినిమాలకు, వెబ్​ సిరీస్​లకు ప్రాధాన్యత ఇస్తానంటోంది అనసూయ. ఇందులో భాగంగానే కన్యాశుల్కం అనే వెబ్​ సిరీస్​లో అనసూయ నటించనుంది. గురజాడ అప్పారావు క్లాసిక్​ నాటకం ఆధారంగా వస్తున్న ఈ సిరీస్​లో మధుర వాణి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X