Anasuya Bharadwaj: నేను కూడా తెలంగాణ బిడ్డనే.. ఆంటీ అన్న నెటిజెన్‌కు గట్టి షాకిచ్చిన నటి
అనసూయ భరద్వాజ్... అందానికి అందం, అభినయానికి అభినయం కలగలిపిన నటి. ఈమె సినిమాల్లో చేసే క్యారెక్టర్లకు ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటుందో నెట్టిన చేసే వ్యాఖ్యలతో కూడా అదే స్థాయిలో నెగిటివిటీ సంపాదించుకుంటుంది. అయితే ఎప్పుడూ హాట్ హాట్ కామెంట్లు చేస్తూ.. తరచుగా వివాదాల్లో చిక్కుకునే ఈమె ఈ మధ్యే కాస్త గ్యాప్ ఇచ్చింది. కానీ పలువురు నెటిజెన్లు మాత్రం ఆమెను వెంటపడి వేదిస్తూనే ఉన్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఈమె తాజాగా ఓ నెటిజెన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో అర్జున్ రెడ్డి సినిమాలో భాగంగా విజయ్ దేవరకొండ పలికిన ఓ బూతు మాటను తనకు నచ్చలేదని.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పుడు అనేక మంది ఆమెపై ట్రోల్స్ చేయగా.. ఖుషీ సినిమా సమయంలో కూడా మరోసారి వివాదానికి తెర తీసింది. విజయ్ దేవరకొండ తన పేరుకు ముందు The పెట్టుకోవడం అవసరమా అంటూ ప్రశ్నించి... రౌడీ బాయ్ ఫ్యాన్స్ అందరితో అనేక ఇబ్బందులు ఎదుర్కుంది. ఆ తర్వాత అతడితో గొడవకు తెరదించిన ఈమె తాజాగా మళ్లీ విజయ్ దేవరకొండ విషయంపై స్పందించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఓ నెటిజెన్ విజయ్ దేవరకొండ విషయం గురించి మాట్లాడుతూ.. చివరలో.. అనసూయ ఆంటీనీ లాగుతారంటూ చెప్పుకొచ్చాడు.

ఇది చూసిన అనసూయ భరద్వాజ్ ఎక్స్ వేదికగా ఆ నెటిజెన్ కు గట్టి రిప్లై ఇచ్చింది. ముఖ్యంగా "ఎందుకు కార్తీక్ గారు అస్తమానం నన్ను లాగుతారు.. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి ఒడిలేశాను... ఒక నమ్మకం.. నా దేవుడి మీద నమ్మకం.. మా అమ్మ నాన్నలు నాకిచ్చిన విలవులు, పెంపకం నన్ను నా దృష్టిలో ఎప్పుడు దిగజారనివ్వవు" అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఇప్పుడు ఈ ట్వీట్ ను కూడా తమ స్వార్థానికి ఎవరైనా వాడుకున్నా తాను ఆశ్చర్యపోనని చెప్పింది.

అంతేకాకుండా.. "నాకు తెలిసి మీరు నేను, మీరు చుట్టాలం అస్సలే కాము.. కాబట్టి నేను మీకు ఆంటీ కానేమో, అయినా ఒకసారి మీ ఇంట్లో ఆడగండి. మీకు తెలికుండ ఏమన్నా సంబంధాలు ఉన్నాయేమో. ఎందుకుంటే నాకు చుట్టలైతేనే ఆ పల్కరింపులు ఉంటాయనీ నాకు పెద్దవాళ్లు నేర్పించారు" అంటూ వివరించింది. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. గట్టిగా రిప్లై ఇచ్చి మంచి పని చేశారని కొందరు.. ఇలాంటి పిచ్చి వాళ్ల కామెంట్లకు రిప్లైలు ఇచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకండని మరికొంత మంది చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











