విజయ్ దేవరకొండతో గొడవపై అనసూయ క్లారిటీ.. డబ్బులిచ్చి అలా అంటూ ఓపెన్ కామెంట్స్
మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ హాట్ యాంకర్ సినీ కెరీర్ మొదట్లో చిత్రాలతో సందడి చేసింది. అనంతరం బుల్లితెరపై గుర్తింపు వచ్చాక మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయపై తరచుగా ట్రోలింగ్ జరుగుతుంది. ఇక విజయ్ దేవరకొండతో అనసూయకు ఉన్న సోషల్ మీడియా గొడవ తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఓపెన్ కామెంట్స్ చేసింది బ్యూటిఫుల్ అనసూయ.
నెట్టింట్లో వివాదం:బ్యూటిపుల్ యాంకర్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య కోల్డ్ వార్ గత కొంతకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండు పరోక్షంగా వ్యతిరేక పోస్టులు, కామెంట్స్ పెడుతూ వస్తున్న అనసూయపై ఆయన ఫ్యాన్స్ విపరీతంగా ట్రోలింగ్ చేసేవారు. ఆంటీ అంటూ ఎక్కువగా కామెంట్స్ చేసేవారు. నెట్టింట్లో వీళ్ల వివాదం కొనసాగుతూనే ఉంది.

గొడవపై అనసూయ:ఇటీవల ఖుషీ పోస్టర్ లో ది విజయ్ అని ఉండటంపై కూడా అనసూయ ఇన్ డైరెక్ట్ గా ఫైర్ అవుతూ కామెంట్స్ చేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ తెగ ఊగిపోయారు. అనసూయ పర్సనల్ ఫొటోలు, భర్తతో లిప్ లాక్ లపై ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండతో వివాదంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది అనసూయ భరద్వాజ్.
తిట్టడం-ట్రోలింగ్ :"2019లో విజయ్ దేవరకొండ తండ్రి మీకు మాత్రమే చెప్తా అని సినిమాను నిర్మించారు. అందులో నేను కూడా నటించాను. అప్పటివరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత విజయ్ టీమ్ లోని ఒకరు నన్ను తిట్టడానికి, ట్రోలింగ్ చేయడానికి ఆయన పబ్లిసిస్ట్ (ప్రచారకర్త) కొందరికి డబ్బులు ఇచ్చినట్లు చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను" అని అనసూయ తెలిపింది.

మంచి స్నేహితులం:"పబ్లిసిస్ట్ పెయిడ్ (డబ్బులిచ్చి) ట్రోల్స్ చేసి ఉంటే విజయ్ కు తెలిసే ఉంటుంది కదా. అతనికి తెలియకుండా వారు ఇలాంటి పని చేయరని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. ఇది సరైనదేనా. నిజానికి నేను విజయ్ మంచి స్నేహితులం. ఇద్దరం కలిసి పలు సినిమాల్లో కూడా నటించాం. ఎప్పుడు మంచి స్నేహితుల్లానే ఉండేవాళ్లం" అని అనసూయ చెప్పుకొచ్చింది.

ప్రశాంతత కావాలి:"అయితే అర్జున్ రెడ్డి తర్వాత ట్రోల్స్ మొదలు కావడంతో దాని వెనుక విజయ్ హస్తం కూడా ఉందని అనుకున్నా. నా మీద విజయ్ ఎందుకు ద్వేషం పెంచుకున్నాడో తెలియదు. అయినా ఈ వివాదాన్ని ఇక్కడితో ముగిద్దామనుకుంటున్నా. నేను మానసికంగా ప్రశాంతత కోరుకుంటున్నా. ఇవన్నీ పక్కన పెట్టి జీవితంలో ముందుకు సాగాలని అనుకుంటున్నాను" అని అనసూయ అసలు విషయం చెప్పింది.

అప్పటి నుంచే ట్రోలింగ్:అర్జున్ రెడ్డి సినిమాలో బోల్డ్ డైలాగ్స్ థియేటర్ లో మ్యూట్ చేశారు. ఆ మూవీ రిలీజ్ సమయంలో థియేటర్ కు వెళ్లిన విజయ్.. అక్కడ యూత్ తో మాట్లాడుతూ ఆ మ్యూట్ చేసిన డైలాగ్ లను చెప్పించే ప్రయత్నం చేశాడట. ఆ విషయంపై అనసూయ అభ్యంతరం తెలిపింది. ఓ తల్లిగా ఆ విషయం తనను బాధించిందని, అలా చేయొద్దని విజయ్ కు చెప్పింది. అప్పటి నుంచే తనపై ట్రోల్స్ మొదలైనట్లు అనసూయ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











