twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ ఓంకార్‌కు కరోనావైరస్.. క్లారిటీ ఇచ్చిన కుటుంబ సభ్యులు

    |

    తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీని కరోనావైరస్ వెంటాడుతున్నది. ఇప్పటికే యాక్టర్లు ప్రభాకర్, హరికృష్ణ కోవిడ్ 19 బారిన పడటం బుల్లితెర వర్గాలను ఆందోళనకు గురిచేసింది. అయితే ఇంకా ఆ ఇద్దరికి కరోనావైరస్ సోకిందనే వార్త మరిచిపోకముందే తాజాగా దర్శకుడు, హోస్ట్, నటుడు, నిర్మాత ఓంకార్‌కు కరోనా సోకిందనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. కోద్ది రోజుల క్రితం ఇస్మార్ట్ జోడి అనే రియాలిటీ షోకు సంబంధించిన షూటింగ్‌లో ఓంకార్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనకు కరోనావైరస్ సోకిందనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే ఆ వార్తలపై కుటుంబ సభ్యులు స్పందించారు.

    Anchor and director Omkar tested coronavirus negative

    ఓంకార్ ఆర్యోగ్యపరంగా బాగానే ఉన్నారు. ఆయనకు కరోనా సోకిందనే వార్తల్లో వాస్తవం లేదు. ఈ వార్తల మధ్య వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొన్నారు. అయితే ఆయననకు కరోనా నెటిగివ్ అని రిపోర్టు వచ్చింది. ఓంకార్‌కు కరోనా అనే వార్తలను నమ్మెద్దు. అసత్య ప్రచారం ఆపాలని కుటుంబ సభ్యులు సూచించారు. ప్రస్తుతం ఓంకార్ ఆరోగ్యం గానే ఉంది. సోమవారం జూన్ 28 నుంచి రెగ్యులర్‌గా షూటింగులో పాల్గొంటారు. మీడియాలో అసత్య వార్తలను ప్రచురించవద్దని ఫ్యామిలి మెంబర్స్ వేడుకొన్నారు.

    ఇదిలా ఉండగా, శనివారం మధ్యాహ్నం నుంచి ఓంకార్‌కు కరోనావైరస్ పాజిటివ్ వచ్చిందనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే డైరెక్టర్‌, యాక్టర్‌ను కాంటాక్ట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో అంతా నిజమేనని భావించారు. అయితే పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

    English summary
    Anchor and director Omkar tested coronavirus Positive rumours goes viral in telugu media. After this viral news, Familly members of Omkar reacted and released press note. Family members condemns the rumours and said that he was fine, tested negative.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X