Anchor Jhansi: 35 ఏళ్లకే గుండెపోటుతో మృతి.. అతడి మరణాన్ని తట్టుకోలేకపోతున్నానంటున్న యాంకర్ ఝాన్సీ!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ క్యూట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఝాన్సి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె.. చాలా ఏళ్లపాటు బుల్లితెరపై ఓ వెలుగు వెలిగారు. ఉదయ భాను, సుమలకు సమానంగా తెలుగు ప్రేక్షకులను అలరించారు. కేవలం యాంకర్ గానే కాకుండా నటిగా కూడా ఝాన్సి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 50 వరకు చిత్రాల్లో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు.
ఓవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలలో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అందిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీ రాసుకొచ్చింది. అందులో చాలా ఎమోషనల్ అయిపోతూ.. ఆమె గుండెలపై పెరిగిన బరువును దించుకున్నారు. తన దగ్గర పని చేసే మేనేజర్.. తన తమ్మడితో సమానం అయిన శ్రీను అనే వ్యక్తి చనిపోయినట్లు చెప్పారు.

ముఖ్యంగా తాను చాలా చనువుగా శ్రీను బాబు అని పిలుచుకునే తన మేనేజర్ శ్రీనుయే తన సపోర్ట్ సిస్టమ్ అని యాంకర్ ఝాన్సి చెప్పుకొచ్చారు. హెయిర్ స్టైలిస్ట్ గా తన దగ్గర ఉద్యోగంలో చేరిన అతడు.. కొద్ది కాలానికి తన మేనేజర్ గా మారాడని వివరించింది. అలాగే తన వృత్తికి సంబంధించిన ప్రతి పనిని ఎంతో సమర్థంగా నిర్వహించేవాడని.. అతడు ఉంటే తాను ఎలాంటి టెన్షన్ లేకుండా పనులు చేసుకునేదాన్నని గుర్తు చేసుకుంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే అతడు చాలా తక్కువ కాలంలోనే తన కుటుంబ సభ్యుడిలా మారిపోయాడని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం 35 సంవత్సరాల వయసు కల్గిన శ్రీను.. తాజాగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడని యాంకర్ ఝాన్సి చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసి తన గుండె బద్ధలు అయిందని... జీవితం అంటనే నీటి బుడగ లాంటిది అని రాసుకొచ్చింది. ఝాన్సి చేసిన ఈ పోస్టు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఓం శాంతి అంటూనే.. వారి కుటుంబానికి మీరు అండగా నిలబడండి మేడం అంటూ చెప్పుకొస్తున్నారు. కేవలం నెటిజెన్లు మాత్రమే కాకుండా టాలీవుడ్ కు చెందిన అనేక మంది సెలబ్రిటీలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా గాయత్రి భార్గవి స్పందిస్తూ.. ఈ వార్త చాలా షాకింగ్ గా అనిపిస్తోందని.. చాలా దారుణం అంటూ కామెంట్ చేసింది. ఆయన చాలా మంచి వాడని, తన కెరియర్ ప్రారంభంలోనూ తనతో ఉన్నాడని చెప్పుకొచ్చింది. గతవారమే కలిసానని ఇంతలోనే ఆయన చనిపోవడం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తోందని పేర్కొంది. అలాగే జీవితం అనేది ఊహాతీతం అంటూ ఎమోషనల్ అయింది. వీరే కాకుండా చాలా మంది ఝాన్సి పోస్టుకు స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











