వెండితెరపై యాంకర్ మంగ్లీ.. ఊల్లాల ఊల్లాల" అంటూ హంగామా
తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా "ఊల్లాల ఊల్లాల" చిత్రం లో నటించింది. అలాగే ఈ చిత్రంలో ఒక పాట కూడా పాడింది. దాంతో పాటు హీరోయిన్ నూరిన్ కి డబ్బింగ్ చెప్పింది. నటరాజ్ , నూరిన్ , అంకిత హీరో, హీరోయిన్లు గా రూపొందుతున్న చిత్రం "ఊల్లాల ఊల్లాల" . సీనియర్ నటుడు 'సత్య ప్రకాష్" ఈ చిత్రం ద్వారా దర్శకుని గా పరిచయమవుతున్నారు.. సుఖీభవ మూవీస్ పతాకంపై ఏ . గురురాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ చిత్రం నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా నిర్మాత ఏ . గురురాజ్ మాట్లాడుతూ.. "మంగ్లీ" కి తెలుగు నాట మంచి పాపులారిటీ ఉంది. ఆమె మా సినిమాలో పాట పాడింది, యాక్ట్ చేసింది, హీరోయిన్ నూరిన్ కి డబ్బింగ్ చెప్పింది. ఈ రకంగా మంగ్లీ మా సినిమా లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలువనుంది. అలాగే బిగ్ బాస్- 2 తో క్రేజ్ తెచ్చుకున్న రోల్ రైడా ఇందులో ఓ పాట పాడడంతో పాటు, ఆ పాటలో నటించారు కూడా. ఇంకా ఈ చిత్రం లో ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయి . భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము . ఇందులో ఎన్నో వింత కా రెక్టర్లు కూడా ఉన్నాయి. మా బేనర్‌లో రక్షకభటుడు, ఆనందం మళ్లీ మొదలైంది, లవర్స్ డే చిత్రాల తర్వాత వస్తున్న సినిమా ఉల్లాలా ఉల్లాలా. ఇలాంటి కాన్సెప్ట్ లు చాలా అరుదుగా వస్తుంటాయి. సత్యప్రకాశ్‌కి నటునిగా ఎంత పేరుందో, దర్శకునిగా అంతకన్నా ఎక్కువ పేరు ఈ చిత్రం ద్వారా వస్తుందని నమ్ముతున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు సత్య ప్రకాష్ మాట్లాడుతూ- ''ఇదొక రొమాంటిక్ ఎంటెర్టైనింగ్ థ్రిల్లర్. మా అబ్బాయి నటరాజ్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అవుతున్నదుకు చాలా గర్వంగా ఉంది . ఈ సినిమాలో చాలా గొప్ప కంటెంట్ ఉంది . చాలా ఎట్రాక్షన్స్ కూడా ఉన్నాయి . ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్ కూడా వున్నాయి'' అని చెప్పారు.

తారాగణం: నటరాజ్, నూరిన్, అంకిత, గురురాజ్, సత్యప్రకాష్, బాహుబలి ప్రభాకర్, పృథ్వీరాజ్, అదుర్స్ రఘు, జబర్ధస్త్ నవీన్, లోబో, మధు, జబర్ధస్త్ అప్పారావు, రాజమౌళి, జ్యోతి, గీతాసింగ్, జయవాణి తదితరులు
సాంకేతిక నిపుణులు:
సమర్పణ: శ్రీమతి ఎ.ముత్తమ్మ,
ఛాయాగ్రహణం: జె.జి.కృష్ణ, దీపక్,
సంగీతం: జాయ్,
ఎడిటింగ్: ఉద్ధవ్,
నృత్య దర్శకత్వం: శేఖర్ మాస్టర్, దిలీప్ కుమార్,
యాక్షన్: డ్రాగన్ ప్రకాష్,
ఆర్ట్: కె.మురళీధర్,
పాటలు: కాసర్ల శ్యామ్, గురుచరణ్,
కథ - స్క్రీన్ ప్లే-మాటలు-
నిర్మాత: ఎ.గురురాజ్,
దర్శకత్వం: సత్యప్రకాష్.


Click it and Unblock the Notifications











