సమంత అడగ్గానే ఒప్పుకుంది.. ప్రతీక్షణం అద్భుతమే.. ప్రదీప్ కామెంట్స్

టాలీవుడ్ టాప్ యాంకర్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రదీప్. పంచ్‌లతో, ప్రాసలతో ప్రత్యర్థులను కట్టడి చేసే ప్రదీప్.. బుల్లితెరపై ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. యాంకర్‌‌గానే కాకుండా సెలెబ్రిటీల సీక్రెట్స్ బయట పెట్టే కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా వంటి షోకు హోస్టింగ్ చేసి ఎంతోమందికి దగ్గరయ్యాడు. వెండితెరపై అడపాదడపా చిత్రాల్లో మెరిసిన ప్రదీప్.. ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

యాంకర్‌గా బిజీ..

యాంకర్‌గా బిజీ..

ఢీ షోకు యాంకరింగ్ చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉండే ప్రదీప్.. ప్రతీ పండగకు స్పెషల్ ఈవెంట్స్‌‌లో మెరుస్తుంటాడు. ప్రదీప్ లేని బుల్లితెర ఈవెంట్, షో పూర్తవ్వదేమో అనేంత ఫేమస్ అయ్యాడు. బుల్లితెరపై వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకుని వెండితెరపై వెలిగేందుకు రెడీ అయ్యాడు.

ఒక్క పాటతో సెన్సేషన్..

ఒక్క పాటతో సెన్సేషన్..

నీలి నీలి ఆకాశం.. అనే ఒక్క పాటతో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రం ఎక్కడికో వెళ్లిపోయింది. చంద్రబోస్ రాసిన ఈ గీతం ప్రదీప్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ పాట సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. పాట క్లిక్ అవ్వడంతో.. మూవీ ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్‌లో చేస్తోంది.

 అడగ్గానే సమంత ఒప్పుకుంది..

అడగ్గానే సమంత ఒప్పుకుంది..

30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రదీప్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా అనే షో ప్రారంభిస్తున్నాను.. మీరు రావాలని అడగ్గానే సమంత ఒప్పుకుందని చెప్పుకొచ్చాడు. ఎంత బిజీగా ఉన్నా కూడా తానే స్వయంగా వచ్చి, క్యాస్టూమ్, మేకప్ తానే తెచ్చుకుని రెడీ అయింది. దాదాపు మూడు గంటల పాటు షో షూట్ చేశానని తెలిపాడు.

Recommended Video

Adirindi Comedy Show Anchor Sameera Out Of The Show
 ప్రతీ క్షణం అద్భుతమే..

ప్రతీ క్షణం అద్భుతమే..

ఇండస్ట్రీలో త్రివిక్రమ్-సునీల్, పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్, రామ్ చరణ్-ఎన్టీఆర్ స్నేహం చూస్తే ముచ్చటేస్తుందని తెలిపాడు. అందులోనూ రామ్ చరణ్‌తో కాసేపు మాట్లాడితే.. అసలీయన మెగాస్టార్ కొడుకేనా? మెగా పవర్ స్టార్ రామ్ చరణేనా? అనే అనుమానం కలుగుతుందని అన్నాడు. ఇక ఎన్టీఆర్‌‌తో ఉంటే ప్రతీ క్షణం అద్భుతమేనని, ఎంతో సరదాగా మాట్లాడుతాడని పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X