జైలుకెళ్లిన ప్రదీప్ హీరోగా ఎలా అంటూ ఫిర్యాదు.. వివరణ ఇచ్చిన యాంకర్
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ గురించి చెప్పాల్సిన పనే లేదు. కేవలం బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైనా అడపాదడపా సినిమాల్లో నటించి కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రదీప్ ఎన్నడూ బుల్లితెరను వదులుకోలేదు. బుల్లితెరపై షోలు చేసుకుంటూ బిజిబిజీగా గడిపేస్తున్నాడు. అయితే ఇంత బిజీగా ఉండే ప్రదీప్.. ఓ సినిమాతో హీరోగా పరిచయం కాబోతోన్నాడు.

సర్‌ప్రైజ్ చేసిన ప్రదీప్..
బుల్లితెర కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీగా ఉండే ప్రదీప్.. గుట్టు చప్పుడు కాకుండా ఓ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఎవరూ ఊహించని విధంగా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. దీంతో ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో అతని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మహేష్ బాబు చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్..
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే మూవీ ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మహేష్ విడుదల చేసిన ఈ పాట సోషల్ మీడియాలో బాగానే క్లిక్ అయింది.

ప్రదీప్‌కు షాక్..
గతంలో ఓ యువతిని వేధించిన కేసులో ప్రదీప్ రెండు రోజులు జైలుకు వెళ్లి వచ్చాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ రూల్స్ కు వ్యతిరేకంగా ప్రదీప్ ప్రవర్తించినందున, ఈ చిత్రం షూటింగ్ ను అడ్డుకోవాలని, ప్రదీప్ నటించకుండా చూడాలని మేడ్చల్ జిల్లా రాంపల్లికి చెందిన శ్రీ రామోజు సునిశిత్ అనే యువ దర్శకుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఖండించిన ప్రదీప్..
ఈ వార్తలపై యాంకర్ ప్రదీప్ స్పందిస్తూ.. తాను జైలుకు వెళ్లానని వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఖండించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఫ్యామిలీ కౌన్సిలింగ్‌కు మాత్రమే వెళ్లానని, తనపై ఆరోపణలు చేస్తోన్న వ్యక్తి ఎవరో కూడా తెలియదన్నాడు. మీడియా వారు నిజాలు తెలుసుకుని రాయాలని కోరాడు.


Click it and Unblock the Notifications











