Pradeep Machiraju : నాలుగేళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ యాంకర్.. యంగ్ హీరోయిన్ ఫొటోతో సర్‌ప్రైజ్..

Pradeep Machiraju : బుల్లితెర రారాజు.. ప్రదీప్‌ మాచిరాజు.. తన యాంకరింగ్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మేల్‌ యాంకర్‌ల్లో ప్రదీప్‌కు వున్న క్రేజ్‌ ఇతర మేల్ యాంకర్స్ కు లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బుల్లితెరపై తెచ్చుకున్న ఫేమ్ తో వెండితెరపై కూడా అడుగుపెట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తారు. ఈ క్రమంలోనే '30 రోజుల ప్రేమకథ'సినిమాతో హీరోగా మారారు ప్రదీప్ మాచిరాజు. అయితే..తాజా తన సోషల్ మీడియాలో ఓ యంగ్ హీరోయిన్ తో కలిసి దిగిన ఫోటోను నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ కథేంటో ఓ లూక్కేద్దాం..

యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి తెలుగు ప్రేక్షకులకు,మరి ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తనదైన పంచ్ డైలాగ్స్, అద్భుతమైన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. తెలుగులో ఉన్న టాప్ యాంకర్స్ లో ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు. కాగా.. ఆయనకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు కాదు. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే బుల్లితెరపై ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహించారంటే అర్థం చేసుకోవచ్చు.

Anchor Pradeep Machiraju s Announced his Second Film Titled as Akkada Ammayi Ikkada Abbayi

తనదైన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ప్రదీప్.. నటనపై ఇంట్రెస్టెంట్ తో సమయం, అవకాశం దొరికినప్పుడల్లా వెండితెరపై సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు. అలా తనలోని నటుడ్ని బయటపెట్టేవాడు. ఈ క్రమంలోనే క్రమంలోనే '30 రోజుల ప్రేమకథ'సినిమాతో హీరోగా తెలుగు వెండి తెరపై కనిపించారు. ఈ మూవీ పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. కానీ, ఈ సినిమాకు మాత్రం అనుకున్న స్థాయికి రిచ్ కాలేకపోయింది.

ఆ సినిమా ప్రదీప్‌కు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చినా అనుకున్నంత విజయం సాధించలేదు. ఈ మూవీ రిజల్ట్ దీంతో ప్రదీప్ సైలెంట్ అయ్యారు. దాదాపు నాలుగు ఏండ్లు వరకు మరో సినిమాలో నటించలేదు. బుల్లితెరపై కూడా ప్రదీప్ కనిపించడం తగ్గించాడు. దీంతో ప్రదీప్ ఏమైపోయాడు అనే కామెంట్స్ వినిపించాయి. కానీ నాలుగేళ్ల తర్వాత.. తాజాగా రెండో సినిమాకు సంబంధించిన ప్రకటన చేసి.. అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రదీప్ మాచిరాజు.

తాజాగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు రెండోవ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ మూవీకి 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను (నేడు) గురువారం విడుదల చేశారు. ఈ మూవీలో ప్రదీప్ సరసన యంగ్ హీరోయిన్ గా జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి నటిస్తోంది. అలాగే.. ఈ మూవీ ద్వారా బబర్ధస్త్‌తో పాటు పలు కామెడీ షోలకు దర్శకత్వం వహించిన నితిన్‌, భరత్‌లు దర్శకులుగా పరిచయమతున్నారు.

ఇక ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని మాంక్స్ అండ్ మంకీస్ పిక్చర్స్ బ్యానరపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని యూత్‌కు నచ్చేలా.. ఓ మంచి ప్రేమకథను జోడించి.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్నారట. ఈ మూవీ డిసెంబరులో విడుదల కాబోతుందట. అయితే.. ప్రదీప్ తన రీ ఎంట్రీ మూవీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ ని వాడుకోవడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X