ప్రదీప్ సినిమా రిలీజ్‌కు డేట్ ఫిక్స్: ట్రైలర్‌ను ఆరోజు విడుదల చేయనున్న స్టార్ హీరో
రేడియో జాకీగా కెరీర్‌ను ఆరంభించి.. యాంకర్‌గా సత్తా చాటుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. దాదాపు ఐదారేళ్లుగా బుల్లితెరపై తన హవాను చూపిస్తోన్న అతడు.. ఎన్నో షోలను ఒంటి చేత్తో నడిపించి విజయాన్ని అందించాడు. అదే సమయంలో అద్భుతమైన టైమింగ్, ఆకట్టుకునే మేనరిజంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. టెలివిజన్ రంగంలో తనదైన మార్క్ చూపిస్తున్న అతడు సుదీర్ఘమైన కెరీర్‌లో పలు చిత్రాల్లోనూ మంచి మంచి పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ క్రమంలోనే '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు.
సుకుమార్ దగ్గర పలు చిత్రాలకు అసిస్టెంట్‌గా పని చేసిన మున్నా అనే కొత్త దర్శకుడితో ప్రదీప్ మాచిరాజు చేసిన చిత్రమే '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'. ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్. అనూప్ మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రంలోని 'నీలి నీలి ఆకాశం' పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఈ పాట ఇప్పటికే రెండు వందల మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రదీప్ సినిమా రిలీజ్‌కు డేట్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.

ప్రదీప్ హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రదీప్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టర్‌ను వదిలాడు. అలాగే, పాట అంత బాగుంటుంది సినిమా అంటూ అందులో పేర్కొన్నాడు. ఇక, ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంతో సాగుతుందని అంటున్నారు. ఇందులో ప్రదీప్ లవ్ గురూగా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ట్రైలర్ సంక్రాంతి కానుకగా జనవరి 14న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల అవుతుందని తెలిసింది.


Click it and Unblock the Notifications











