బిర్యానీ పంపిస్తా నా సినిమా చూడు.. యాంకర్ ప్రదీప్ కు సినిమా కష్టాలు!

ఏ భాషలో సినిమా దగ్గర అయినా కూడా వెండితెరపై పరిచయం అవ్వడం అనేది చాలా మందికి ఒక కలగా ఉంటుంది. అయితే అంత వరకు వెళ్లడం ఒకెత్తు అయితే అలా వెళ్ళాక దానిని నిలబెట్టుకోవడం అనేది ఇంకా సున్నితమైన అంశం అని ఇలా తెలుగు సినిమా దగ్గర ఉన్న హీరోస్ లో బుల్లితెర నుంచి వెండితెర వరకు వచ్చిన అతి కొద్ది మంది నటుల్లో యాంకర్ ప్రదీప్ కూడా ఒకడు.

ఎన్నో ఏళ్లుగా స్మాల్ స్కరీనా ఆడియెన్స్ ని అలరించిన యాంకర్ ప్రదీప్ ఇపుడు ఫైనల్ గా హీరో అయ్యాడు. అయితే ప్రదీప్ ఇపుడు వరకు హీరోగా రెండు సినిమాలు మాత్రమే చేసాడు. నటుడుగా చాలా సినిమాలు చేసినప్పటికీ తన మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో మొదటి మెట్టే భారీ బ్లాక్ బస్టర్ ని ప్రదీప్ అందుకోవడం విశేషం.

anchor pradeep new movie struggles in theaters

కాగా ఈ చిత్రం తర్వాత తాను హీరోగా వచ్చిన మరో చిత్రమే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ ని తాను పెట్టుకున్నప్పటికీ ఈ సినిమా రీచ్ అంతగా జనంలోకి వెళ్లలేకపోయింది. తన ఫ్రెండ్స్ స్మాల్ స్క్రీన్ నటీనటులతో తాను మంచి ఫన్ వీడియోస్ ప్రమోషన్స్ గా చేసి ఓకే రేంజ్ లో సినిమాని రిలీజ్ చేసుకున్నాడు.

అయితే ఎప్పుడు టైం ఒకేలా ఉండదుగా.. అలానే ఈ సినిమాకి ఒకింత టాక్ బాగానే వచ్చినప్పటకీ థియేటర్స్ లో జనం కరువయ్యారు. పైగా సోషల్ మీడియాలోనే తన సినిమా కోసం థియేటర్స్ కి వెళ్లకుండా ఆ టికెట్ డబ్బులతో బిర్యానీ పెట్టుకొని ఓటిటిలో వేరే సినిమా చూసుకుంటాము అంటున్న నెటిజన్స్ కి యాంకర్ ప్రదీప్ ఏమాత్రం సహనం కోల్పోకుండా చాలా గౌరవంగానే నా సినిమా థియేటర్ లోనే చూడు హ్యాపీగా నవ్వుకో.. కావాలంటే ఆ బిర్యానీ ఏదో నేనే కొంటాను అంటూ ప్రదీప్ సెలవిచ్చాడు.

దీనితో తన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటి సినిమా తోనే మంచి హిట్ అందుకున్న ప్రదీప్ ఇపుడు తన సినిమాకి ఆడియెన్స్ వెళ్లక ఇలా మాట్లాడడం అనేది ఒకింత బాధాకరమే అని చెప్పాలి. కాగా ప్రదీప్ ఈ చిత్రంని తాను యాంకర్ గా చేసిన పలు షోస్ దర్శకులు నితిన్ - భారత్ లు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ప్రదీప్ షోస్ లోనే మరో యాంకర్ గా చేసిన యువ బ్యూటీ దీపికా పిల్లి ఈ సినిమాలో ప్రదీప్ మాచిరాజు సరసన హీరోయిన్ గా నటించింది.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ప్రదీప్ ఈ చిత్రాన్ని చేసాడు. కొన్నాళ్ళు అయితే అసలు తాను ఏమైపోయాడో కూడా ఎవరికీ తెలియలేదు. అలా చేసినప్పటికీ ఈ చిత్రం పరిస్థితి థియేటర్స్ లో అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. మరి చూడాలి లాంగ్ రన్ లో ఏమన్నా మారుతుందో లేదో అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X