నా ఫస్ట్ లవర్ ఆమెనే.. ఈ పాటికి అన్నీ అయిపోయి ఉంటాయి.. యాంకర్ ప్రదీప్ షాకింగ్ రియాక్షన్
యాంకర్‌గా చేస్తూనే వెండితెరపై హీరోగా రాణించేందుకు రెడీ అయ్యాడు ప్రదీప్. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతో హీరోగా వెండితెర గడప తొక్కబోతున్నాడు ఈ యంగ్ బ్యాచిలర్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్, పెళ్లి గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రదీప్. ఆ వివరాలేంటో చూద్దామా..

30 రోజుల్లో ప్రేమించడం ఎలా? డిమాండ్
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ఈ టైటిల్ చూడగానే యూత్ అంతా ఆకర్షితులయ్యారు. పైగా ప్రదీప్ లాంటి పంచ్ మాస్టర్ హీరో కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతలో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్స్, సాంగ్స్ రిలీజ్ చేసి మరింత హైప్ క్రియేట్ చేశారు. దీంతో ఈ మూవీ డిమాండ్ అంతకంతకూ పెరిగింది.

షూటింగ్ ఫినిష్.. బిజీ బిజీ
ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. మర్చి 25న విడుదల కానున్న నేపథ్యంలో ప్రదీప్ సహా హీరోయిన్, దర్శకనిర్మాతలు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రదీప్ తన మొదటి లవర్ ఎవరో చెప్పి ఆశ్చర్యపరిచాడు.

మొదటి గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? అనగానే..
మీ మొదటి గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? ఫస్ట్ లవ్ మ్యాటర్ ఏమైనా ఉందా? అని అడగ్గానే సోనాలి బింద్రే అని సమాధానిచ్చాడు ప్రదీప్. ఆమె అంటే నాకూ ఇష్టమే కానీ రియల్ గర్ల్‌ఫ్రెండ్ పేరు చెప్పు అని ప్రదీప్‌ని ఫోర్స్ చేశాడు యాంకర్. అప్పుడు విషయం బయటపెట్టిన ప్రదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఫస్ట్ లవర్ పేరు.. ఈ పాటికి ఆమెకి!
తన ఫస్ట్ లవర్ పేరు చెప్పే ఉద్దేశ్యం లేదని.. ఎందుకంటే ఈ పాటికి ఆమెకి పెళ్లయిపోయి ఉంటుందని, ఇప్పుడు పిల్లలతో కలిసి ఈ షో చూస్తూ ఉందేమో అని అన్నాడు ప్రదీప్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రదీప్ చెప్పిన ఈ లవ్ మ్యాటర్ జనాలకు ఆసక్తి కలిగిస్తోంది.

వచ్చే ఏడాది ప్రదీప్ పెళ్లి!
ఈ మేరకు తన పెళ్లి గురించి కూడా స్పందించిన ప్రదీప్.. బహుశా వచ్చే ఏడాది తన పెళ్లి ఉండొచ్చనే కోణంలో మాట్లాడాడు. ఇంట్లో వాళ్లు చూసిన సంబంధాన్ని చేసుకుంటానని చెబుతూనే.. పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలైతే ఉండవని చెప్పాడు.
Recommended Video

30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు మున్నా ఈ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' చిత్రానికి దర్శకత్వం వహించాడు. సుకుమార్‌తో కలిసి ఈయనకు ''ఆర్య 2, నేనొక్కడినే'' లాంటి సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన అనుభవముంది. చిత్రంలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనకాడకుండా ఎస్వీ బాబు ఈ సినిమాను నిర్మించారు.


Click it and Unblock the Notifications











