వర్మకి లైవ్‌లో ప్రపోజ్ చేసిన యాంకర్.. వర్మ ఆన్సర్ వింటే షాక్ అవ్వాల్సిందే!
తెలుగులో రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు తనదైన టెక్నిక్స్ వాడుతూ సినిమాల ట్రెండ్ మార్చిన ఆయన ఇప్పుడు కేవలం వివాదాస్పద సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రేక్షకుల మీద ఆయనకు ఆసక్తి తగ్గిందో లేక ఆయన సినిమాల మీద ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిందో తెలియదు కానీ ఆయన నుంచి చెప్పుకోదగ్గ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూ ఇచ్చినంత గ్యాప్ లోనే సినిమాలు చేసేస్తూ కాలం వెళ్లదీస్తున్న వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ కు షాక్ ఇచ్చారు. సదరు యాంకర్ వర్మని పెళ్లి చేసుకుంటానని అడగగా ఆమెకు విస్తుపోయే ఆన్సర్ ఇచ్చారు వర్మ. ఆ వివరాల్లోకి వెళితే

శివతో వచ్చి
1989లో నాగార్జున హీరోగా శివ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు వర్మ.. మొదటి సినిమాతోనే తెలుగు సినిమా దిశ, దశ మార్చి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిన క్షణక్షణం, అంతం, రాత్రి, గాయం లాంటి సినిమాలు ఆయనలో టాలెంట్ ని బయట పెట్టాయి. ఒక రకంగా ఆయన నుంచి చివరిగా వచ్చిన సూపర్ హిట్ సినిమా ఏది అని అడిగితే అది వంగవీటి అని చెప్పక తప్పదు. ఆ తర్వాత దాదాపు పదికి పైగా సినిమాలు చేసిన అవన్నీ ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయాయో కూడా తెలియని పరిస్థితి.

ఆ విషయంలో క్లారిటీ
అయితే ఆడవాళ్ళ విషయంలో వర్మ చాలా క్లారిటీగా ఉంటారు. వాళ్ల దగ్గర నుంచి తనకు కావాల్సింది ఏమిటి ? తన దగ్గర నుంచి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏమిటి ? లాంటి విషయాల్లో క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు కాబట్టి ఆయన మీద ఎలాంటి ఆరోపణలు లేవు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ కెమెరా ముందు మీరంటే ఇష్టం అని పెళ్లి చేసుకోమని కోరింది. దీంతో ఆర్జీవి తనదైన శైలిలో స్పందించారు.

పెళ్లి చేసుకోమంటే
తనకు పెళ్లి అనే బంధం మీద నమ్మకం పోయిందని, సొసైటీ కోసం ఏదో మేం పెళ్లి చేసుకున్నాం అని చెప్పుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నారు తప్ప నిజంగా బంధానికి ఎవరూ విలువ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. ఆ బంధానికి విలువ ఇవ్వనప్పుడు పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు కలిసి ఉండొచ్చని ఆయన చెప్పుకొచ్చారు. దాన్నే లివింగ్ టుగెదర్ అని అంటున్నారని ఆయన అన్నారు. చెప్పుకొచ్చారు. ఈ ఆన్సర్ తో విస్తుపోవడం యాంకర్ వంతయింది.

ఒక్కరు చాలడం లేదు
ఇక ఆ తర్వాత తాను ఒకప్పుడు ఒక స్త్రీని మాత్రమే ప్రేమించానని కానీ ఇప్పుడు చాలా మంది స్త్రీలను ప్రేమిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.. అలాగే మీరు పెళ్ళి చేసుకోమని అడిగారు కాబట్టి మీరు అంటే ఇష్టమే, స్త్రీ జాతిలో ఒకరిగా ఉన్నమీరు అంటే ఇష్టమే కానీ మీరంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదని ఆమెకు వర్మ షాకిచ్చాడు.
Recommended Video

కొన్ని గంటలే ప్రేమిస్తా
అంతేకాక ఒక సమయంలో తాను కొన్ని నెలల పాటు ఎఫైర్ నడిపేవాడిని, లేదా కొన్ని సంవత్సరాల పాటు నడిపేవాడిని అని అన్నారు. కానీ ఇప్పుడు కొన్ని గంటల వరకు మాత్రమే తాను ప్రేమించగలుగుతున్నానని చెప్పుకొచ్చాడు. అలాగే ముఖ్యంగా స్త్రీ ముఖం చూసిన వెంటనే ఆమె మీద ఆకర్షణ కలుగుతుందని అలాగే కొన్ని కోణాల్లో ఆమె వాయిస్ కూడా ఆమె మీద ఆసక్తి కలిగించేలా చేస్తుందని వర్మ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











