మేము వేశ్యలుగా మారడానికి వాళ్లే కారణం.. రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు
బ్యూటిఫుల్ యాంకర్ రష్మీ తాజాగా అమ్మాయిలు ప్రాస్టిట్యూట్లుగా మారడానికి అబ్బాయిలే కారణం అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మరి ఇంతకీ ఈ బుల్లితెర తన చిన్నది ఎవరిని ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేసింది అనే విషయంపై లుక్కేద్దాం పదండి.
రష్మీ గౌతమ్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లాంటి పాపులర్ షోలలో హోస్ట్ గా కనిపించి అదరగొట్టింది. హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఈ చిన్నది కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి ఎక్కువగా మూగ జీవాలకు ఏదన్నా ఆపద వస్తే అస్సలు తట్టుకోలేదు. అలాగే తనపై ఎవరన్నా నెగెటివ్ కామెంట్స్ చేసినా పొరపాటున కూడా సహించదు. తనదైన శైలిలో ఇచ్చి పడేస్తుంది. ఇక మహిళల విషయంలో కూడా అన్యాయం జరిగితే సపోర్ట్ చేయడానికి రష్మి ఏమాత్రం వెనకాడదు.
తాజాగా ఈ బ్యూటీ మరోసారి అమ్మాయిలకు సపోర్ట్ గా తన గళాన్నివిప్పింది. తాజాగా రష్మి గౌతమ్ రచయిత్రి రాచెల్ మోరన్ రాసిన కోట్ ని షేర్ చేసి అబ్బాయిలను టార్గెట్ చేస్తూ కామెంట్ చేసింది.
రాచెల్ మోరన్ కోట్ లో పేద స్త్రీలు ఆకలితో ఉంటే నోట్లో అన్నం పెట్టాలి. అంతేగాని *** కాదు అని రాసి ఉంది. అదే కోట్ ను తన సోషల్ మీడియా స్టోరీలో పంచుకుంది రష్మీ. ఈ పోస్ట్ ను తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ అబ్బాయిలు బాగుంటే అమ్మాయిలు వ్యభిచారం చేయరు అని అర్థం వచ్చేలా కామెంట్స్ చేసింది.
దీంతో అసలు రష్మీ ఈ పోస్ట్ ఎందుకు చేసింది అనే విషయాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆమె అభిమానులు. అయితే రష్మీ మహిళలకు హక్కుల కోసం తరచుగా సోషల్ మీడియా వేదికగా పోరాడుతుంది అన్న విషయం తెలిసిందే. తన దృష్టికి వచ్చిన మహిళల సమస్యలపై గట్టిగానే స్పందిస్తుంది.

తాజాగా ఆమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం రాజకీయాల్లో దుమారం రేపుతున్న రేవణ్ణ ప్రజ్వల్ కేసు నేపథ్యంలోనే సెటైరికల్ గా రష్మి ఈ కామెంట్స్ చేసిందంటే మాటలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా ఆమె రేవణ్ణ ప్రజ్వల్ పై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేసిందని టాక్ నడుస్తోంది.
కానీ రష్మీ మాత్రం తన పోస్టులో ఎక్కడా రేవన్న పేరును ప్రస్తావించలేదు. అసలు ఆ విషయం గురించి మాట్లాడలేదు. అయినప్పటికీ ఆమె పోస్ట్ ను రేవణ్ణ ప్రజ్వల్ కేసుకు లింక్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. ఇక ఈ కేసుపై రష్మీ గౌతమ్ మాత్రమే కాకుండా సింగర్ చిన్మయి శ్రీపాద కూడా ఇలాగే స్పందించింది. రాచెల్ మోరల్ కోట్ ను పంచుకుంటూ ట్వీట్ చేసింది చిన్మయి.
కాగా కర్ణాటకలో జేడియు ఎంపి, మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై రేప్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్ళ ఇంట్లో పని చేసే 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణ, అతని తండ్రి హెచ్ డి రేవణ్ణలపై ఇంట్లో పని చేసే ఆడవాళ్లను లైంగికంగా వేధించారు అని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పలువురు మహిళలు ఈ విషయంపై భగ్గుమంటున్నారు.


Click it and Unblock the Notifications











