Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోగా ఫస్ట్‌లుక్‌తోనే అదరగొట్టిన యాంకర్ రవి.. శేఖర్ మాస్టర్‌తో తోటబావి..
యాంకర్ రవి హీరోగా గౌతమి హీరోయిన్గా గద్వాల్ కింగ్స్ సమర్పణలో జోగులాంబ క్రియేషన్స్ పతాకంపై అంజి దేవండ్ల దర్శకత్వంలో ఆలూర్ ప్రకాష్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం తోటబావి. దౌలు (విష్ణుప్రియ హోటల్); చిన్న స్వామి; అభినేష్ .బి సహనిర్మాతలు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ రోజు శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా విడుదలైంది.
ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ... తోటబావి టైటిల్ చాలా కొత్తగా ఉంది. యాంకర్ రవి హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ బావుంది. దర్శక నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తీసుకరావాలని కోరుకుంటున్నా అన్నారు.
దర్శకుడు అంజి దేవండ్ల మాట్లాడుతూ...యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతోన్న చిత్రం తోటబావి. ఇప్పటికే షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హీరో రవిగారు ఇచ్చిన సపోర్ట్ తో సినిమాను బాగా తీయగలిగాం. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమా క్వాలిటీగా రావడానికి సహకరించారు అన్నారు.
నిర్మాత ఆలూర్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ..మా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన డాన్స్ మాస్టర్ శేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మా దర్శకుడు కథ, కథనాలు చాలా ఇంట్రస్టింగ్ గా తయారు చేశారు. అదే విధంగా తెరకెక్కించారు. రవి గారి సపోర్ట్ మరువలేనిది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
హీరోగా నటించిన యాంకర్ రవి మాట్లాడుతూ... టైటిల్ లాగే సినిమా అంతా కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. డైరక్టర్ చెప్పినదానికంటే కూడా అద్భుతంగా చిత్రీకరించారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు అన్నారు.
నటీనటులు: శివశంకర్ మాస్టర్, ఛత్రపతి శేఖర్, నర్సింహా రెడ్డి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, రోహిణి, ఉన్నికృష్ణ, అభి, శివం తదితరులు
సినిమాటోగ్రఫీః
చిడతల
నవీన్;
ఎడిటర్ః
గిరి;
సంగీతంః
దిలీప్
బండారి;
స్టంట్స్ః
శంకర్;
కొరియోగ్రఫీః
సన్ని;
లిరిక్స్ః
రామాంజనేయులు;
స్టిల్స్ః
పాండు
రంగ;
సహనిర్మాతలుః
దౌలు
(విష్ణుప్రియ
హోటల్);
చిన్న
స్వామి;
అభినేష్
.బి;
నిర్మాతః
ఆలూర్
ప్రకాష్
గౌడ్;
కథ-స్క్రీన్
ప్లే
-మాటలు-దర్శకత్వంః
అంజి
దేవండ్ల.