ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: బిగ్ బాస్ హౌస్‌లో తెలంగాణ పిల్ల సహా హాట్ యాంకర్

బుల్లితెర పాపులర్ షో 'బిగ్ బాస్'కి సంబందించి రోజుకో ఆసక్తికర వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో హోస్ట్, పార్టిసిపెంట్స్ గురించిన ఎన్నో విశేషాలు ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్స్ లిస్టులో తెలంగాణ తీన్మార్ పిల్ల సావిత్రి, హాట్ యాంకర్ శ్రీముఖి కూడా ఉందనే సమాచారం హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించి సావిత్రి, శ్రీముఖిలతో సంప్రదింపులు కూడా జరిగాయని ప్రచారం ఊపందుకుంది.

సావిత్రి ముచ్చట్లు.. శ్రీముఖి చిందులు

సావిత్రి ముచ్చట్లు.. శ్రీముఖి చిందులు

ముచ్చట చెప్పడంలో యాంకర్ సావిత్రిని మించిన పిల్ల ఉండదు. తీన్మార్ మొదలైందంటే చాలు ఏ ఇంట్లో చూసిన ఆమె ముచ్చటే వినిపిస్తుంది. ఇక శ్రీముఖి హంగామా ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. వేదికపైకి వచ్చిందంటే చిలిపి నవ్వు, ఊపు తెప్పించే స్టెప్పులు వేస్తూ బుల్లితెరకు కొత్త అందం తెస్తుంది. అలాంటి ఈ ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరవుతున్నారనే వార్త బుల్లితెర ఆడియన్స్‌లో ఆతృత నింపుతోంది.

అప్పుడు యాంక‌ర్ శ్యామ‌ల.. ఇప్పుడు యాంకర్ సావిత్రి

అప్పుడు యాంక‌ర్ శ్యామ‌ల.. ఇప్పుడు యాంకర్ సావిత్రి

బిగ్ బాస్ సీజన్ 2 లో యాంక‌ర్ శ్యామ‌ల చేసిన హంగామా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కారణంగా.. ఈ సారి తెలంగాణ పిల్ల యాంకర్ సావిత్రితో అంతకుమించిన హంగామా చేయించాలని ఫిక్స్ అయ్యారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు, రెమ్మ్యూనరేషన్ విషయాలు కూడా చర్చించారని, ఇందుకు సావిత్రి సుముఖత వ్యక్తం చేసిందని తెలుస్తోంది.

కెఏ పాల్, రేణుదేశాయ్ కూడా

కెఏ పాల్, రేణుదేశాయ్ కూడా

మరోవైపు బిగ్ బాస్ 3 లో రాజకీయ సంచలనం కెఏ పాల్, పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా పార్టిసిపేట్ చేయనుందని అంటున్నారు. ఈ లెక్కన బిగ్ బాస్ సీజన్ 3లో అన్ని రకాల వ్యక్తుల హంగామా చూసేందుకు మనం రెడీ కావొచ్చన్నమాట. ఈ షో సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది.

బిగ్ బాస్ 3 హోస్ట్ సంగతులు చూస్తే

బిగ్ బాస్ 3 హోస్ట్ సంగతులు చూస్తే

బిగ్ బాస్ షో మొదటి సీజన్‌లో ఎన్టీఆర్ హోస్ట్‌గా చేశారు. ఆ తర్వాత సెకండ్ సీజన్‌లో ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉండటం కారణంగా ఆ బాధ్యతలను నాని తన భుజాలపై వేసుకొని భేష్ అనిపించుకున్నాడు. దీంతో త్వరలో ప్రారంభం కానున్న మూడో సీజన్ హోస్ట్‌గా నాని, ఎన్టీఆర్ లతో పాటు నాగార్జున, వెంకటేష్ అనుష్క లాంటి ఇతర తారల పేర్లు పరిశీలిస్తున్నారని సమాచారం.

 ఇంతకీ జరిగే పనేనా..?

ఇంతకీ జరిగే పనేనా..?

ప్రస్తుతానికి బిగ్ బాస్ 3 పై వస్తున్న వార్తలన్నీ కేవలం చెప్పుకోవడానికే తప్ప షో నిర్వాహకుల నుంచి ఒక్క అఫీషియల్ ప్రకటన కూడా రాలేదు. ఇప్పటికే నాగార్జున, అనుష్క, రేణు దేశాయ్, కేఏ పాల్, శ్రీముఖి, సావిత్రి లాంటి ఎందరో ప్రముఖుల పేర్లైతే బయటకు వచ్చాయి గానీ చివరకు ఏం జరుగుతుందనేది చెప్పలేం. ఇందులో కొందరి పేర్లు ఓకే గానీ ఇంకొందరి పేర్లు చూస్తుంటే అది జరిగే పనేనా? అనే సందేహం తలెత్తుతోందట జనాల్లో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X