Sreemukhi: ఆ విషయంలో పొరపాటు జరిగింది.. బహిరంగ క్షమాపణలు చెప్పిన శ్రీ ముఖి..
Sreemukhi: బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దగుమ్మ తరువాత యాంకరమ్మగా మారింది. తన స్టైల్ లో యాంకరింగ్ చేసి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు తన మాటలు గారడితో ప్రేక్షకులను మాయ చేస్తోంది. తన గ్లామర్ తో తాను చేసే షోలకు కూడా గ్లామర్ తీసుకువస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవహరిస్తూ.. వచ్చిన గెస్టులకు ఎలివేషన్స్ ఇస్తూ నోరుజారింది. తన మాటలను ఖండిస్తూ.. సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు రావడంతో శ్రీముఖి బహిరంగంగా క్షమాపణ చెప్పింది. అసలు ఏం జరిగిందంటే..?
ఇటీవల నిజామాబాద్ వేదికగా జరిగిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించింది. ఇందులో భాగంగా శ్రీముఖి మాట్లాడుతూ దిల్ రాజు, శిరీష్ లకు ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇవ్వడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో రామలక్ష్మణుల ప్రస్తావన వచ్చింది. దిల్ రాజు, తన సోదరుడు శిరీష్‌లను శ్రీ రామలక్షణులతో పోల్చింది.

ఈవెంట్లో దిల్ రాజు బ్రదర్స్ ను పొగుడుతూ '"ఎప్పుడో రామలక్ష్మణులు అనే ఫిక్షనల్ (కల్పితం) క్యారెక్టర్స్ గురించి విన్నాం. కానీ, సాక్షాత్తు రామలక్ష్మణులు నా కనుల ముందు కూర్చున్నారు. అది ఎవరో కాదు ఒకరు దిల్ రాజు. ఇంకొకరు శిరీష్" అని పేర్కొంది. శ్రీ రామలక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనడంతో వివాదం ప్రారంభమైంది. సోషల్ మీడియా వేదికగా శ్రీముఖిపై మాటల దాడి మొదలైంది. శ్రీముఖి కామెంట్స్ ను తప్పు పడుతూ హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. పలువురు ఓపెన్ చాలెంజ్ చేస్తూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
మరికొందరు అయితే రామలక్ష్మణులు పిక్షనల్ క్యారెక్టర్స్ అని ఎలా అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ముత్తాత ఎవరో నీకు తెలియదు అలా అని వారు పిక్షనల్ అవుతారా.. వారు లేకపోతే మరి నువ్వు ఎలా పుట్టావు నువ్వు అసలు హిందువేనా అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా సోషల్ మీడియాలో శ్రీముఖి కామెంట్స్ వైరల్ కావడంతో ఈ యాంకరమ్మ తన తప్పును తెలుసుకుంది.

శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా హిందువులకు క్షమాపణ చెప్పింది.' ఇటీవల నేను హోస్ట్ చేసిన ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణులను పిక్షనల్ క్యారెక్టర్లు ఆడడం జరిగింది, నేను కూడా హిందువునే.. నేను భక్తురాలనే, రామున్ని అమితంగా నమ్మే దానిని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంకెప్పుడు ఈ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానని మీ అందరికీ మాట ఇస్తున్నాను మీ అందరికీ క్షమాపణలు కోరుతున్నాను దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించగలరని వేడుకుంటున్నాను అంటూ శ్రీముఖి బహిరంగంగా క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది.
ప్రస్తుతం శ్రీముఖి వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. యాంకర్ అమ్మ క్షమాపణలు చెప్పడంపై భిన్న అభిప్రాయాలు కొందరు తప్పు తెలుసుకుందని కామెంట్లు చేస్తూ ఉంటే.. మరి కొందరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి ఇంతటితోనైనా ఈ వివాదానికి తెరపడుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











