జీఎస్టీ రైడ్స్‌ను ఖండించిన సుమ.. రాసేముందు చెక్ చేసుకోండి.. చురకలంటించిన యాంకర్
నగరంలో ఏకకాలంలో 23 ప్రాంతాల్లో జీఎస్టీ రైడ్స్ జరిగాయని అందులో భాగంగా.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి, యాంకర్స్ సుమ, అనసూయ ఇంట్లోనూ జీఎస్టీ అధికారులు తనిఖీ నిర్వహించారని వార్తలు హల్ చల్ చేశాయి. ప్రముఖ టీవీ చానెళ్లలో కూడా ఈ వార్తలు ప్రసారం కావడంతో అంతటా వ్యాప్తి చెందాయి. అయితే అందులో నిజనిజాలు తెలుసుకోకుండా ఎలా ప్రసారం చేస్తారంటూ యాంకర్ సుమ మండిపడింది.

జీఎస్టీ ఎగవేతదారులపై..
యాంకర్ అనసూయ, సుమ, లావణ్య త్రిపాఠి వంటి వారు ప్రైవేట్ సంస్థలో పెట్టుబడులు పెట్టారని, వాటికి సంబంధించిన జీఎస్టీ పన్నులను చెల్లించకుండా ఎగవేశారనే వార్తలు హల్ చల్ చేశాయి. వీరికి సంబంధమున్న కార్యాలయలు, సంస్థల్లోకూడా సోదాలు నిర్వహించారని ప్రచారం జరిగింది.

ఖండించిన సుమ..
ఈ వార్తలు దావానంలా వ్యాప్తి చెందుతుండటంతో.. వీటికి అడ్డుకట్ట వేసేందుకు సుమ రంగంలోకి దిగింది. సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. తన ఇంట్లో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. తాను ప్రభుత్వం చట్టాలకు లోబడి పన్నులకు కడుతున్నాని చెప్పుకొచ్చింది.
అన్నీ నిరాధారమైనవే..
తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, అన్నీ నిరాధారాలేనని తేల్చి చెప్పింది. మనుషులు ఎందుకు మానవత్వాన్ని విస్మరిస్తున్నారు.. తప్పుడు వార్తలు రాయడం కూడా ఒక నేరమే.. దయ చేసి రాసేటప్పుడు చెక్ చేసుకోండి.. మీడియా బాధ్యతగా మెలగాలంటూ చురకలంటించింది.

గతంలో నాగార్జున కూడా..
గత నెలలో సురేష్ ప్రొడక్షన్స్, వెంకటేష్, నాని, నాగార్జున లాంటి వారిపై ఐటీ రైడ్స్ నిర్వహించారని వార్తలు వచ్చాయి. అయితే నాగార్జున మాత్రం వీటిని సీరియస్‌గా తీసుకుని ఖండించాడు. తప్పుడు వార్తలు రాసేవారిపైన నాగ్ అసహనం వ్యక్తం చేశాడని టాక్.


Click it and Unblock the Notifications











