Anchor Suma: పెళ్లైన హీరోకి మళ్లీ పెళ్లి చేయబోతున్న యాంకర్ సుమ.. అదికూడా తెలుగు హీరోయిన్‌తో!

యాంకర్ సుమ కనకాల.. ఈపేరు తెలియని తెలుగు సినీ ప్రియులు లేరంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందం అంతకు మించిన స్పాంటేనియస్ తో అందరినీ అలరిస్తోందీ ముద్దుగుమ్మ. అదిరిపోయే షోలతో పాటు అనేక సినిమా ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తూ.. బాగానే సంపాదిస్తోంది. అయితే యాంకరింగ్ చేసే ఈమె ఇప్పుడు ఓ పెళ్లికి పెద్దలా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓ పెళ్లై.. పిల్లలున్న హీరోకి మళ్లీ పెళ్లి చేయబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఓ కుర్ర హీరోయిన్ తో. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మొదట సినిమాలు, సీరియల్స్ చేసిన సుమ.. ఆ తర్వాత యాంకరింగ్ కూడా స్టార్ట్ చేసింది. అయితే అచ్చమైన తెలుగుతో మాట్లాడుతూ.. అందరికీ దగ్గరైన ఈమె.. పూర్తిగా టీవీలకు పరిమితం అయిపోయింది. ఇటీవలే ఓ సినిమా కూడా చేసినా.. ఎక్కువగా ఆమె ఫోకస్ టీవీ షోలపైనే. అయితే కెరియర్ లో సక్సెస్ ఫుల్ యాంకర్ గా దూసుకెళ్తున్న ఈమె తాజాగా ఓ పెళ్లికి పెద్దగా మారిపోయింది. అయితే హీరో అల్లరి నరేష్ కు ఈ ముద్దుగుమ్మ రెండో పెళ్లి చేసే ప్రయత్నం చేస్తోంది. అది కూడా ఓ హీరోయిన్ తో.

Anchor Suma Going to Remarry One Tollywood Hero With Heroine Check Details

ముఖ్యంగా జాతి రత్నాలు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో అల్లరి నరేష్ కు పెళ్లి చేయాలని చూస్తోంది. తనని తాను పెళ్లిళ్ల పేరమ్మగా చెప్పుకుంటూ... అప్పటికే పెళ్లి అయి ఓ కూతురు కూడా ఉన్న అల్లరి నరేష్ తో ఫరియా అబ్దుల్లా మెడలో మూడు ముళ్లు వేయించాలని చూస్తోంది. ముఖ్యంగా ఈ విషయాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తానే ఇంటర్వ్యూ చేస్తూ.. నరేష్, ఫరియా అబ్దుల్లాతో దీని గురించి మాట్లాడింది.

Anchor Suma Going to Remarry One Tollywood Hero With Heroine Check Details

అయితే ఇదంతా నిజ జీవితంలో కాదని చూస్తుంటేనే అర్థం అవుతుంది. ముఖ్యంగా అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లాలు కలిసి తాజాగా ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా చేశారు. ఈ సినిమాలో పెళ్లి చేసుకోకుండా.. అల్లరి నరేష్ ఎదుర్కున్న సమస్యలను చూపిస్తారు. ముఖ్యంగా ఫరియా అబ్దుల్లాతో ప్రేమాయణం, చివరకు వీరిద్దరికీ పెళ్లి జరిగిందా లేదా అని చూపించబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే మూవీ టీం ఓ ఇంటర్వ్యూకు హాజరు అయింది. అక్కడే యాంకర్ సుమ.. హీరో అల్లరి నరేష్ కు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తూ కనిపిస్తుంది.

Anchor Suma Going to Remarry One Tollywood Hero With Heroine Check Details

ఆ ఒక్కటి అడక్కు సినిమాలో అల్లరి నరేశ్​తో పాటు ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిశోర్​, జామీ లివర్​, వైవా హర్ష, అరియానా గ్లోరి సహా పలువురు నటిస్తన్నారు. చిత్రాన్ని మల్లి అంకమ్​ తెరకెక్కిస్తున్నారు. చిలకా ప్రొడక్షన్స్​ బ్యానర్​పై రాజీవ్​ చిలక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్​గా వ్యవహరిస్తున్నారు. గోపి సందుర్ సంగీతం అందిస్తున్నారు. సూర్య డీఓపీ బాధ్యతలు చూసుకుంటున్నారు. మే 3వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొడుతుందో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X