వివాదంలో యాంకర్ సుమ.. 26 లక్షలు కట్టి నష్టపోయాం.. బాధితులు లబోదిబో అంటూ
సినిమా ఫంక్షన్లలో తన మాటకారితనంతో ఆకట్టుకొన్న యాంకర్ సుమ ఇటీవల తరచుగా వివాదాలు, మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. సందర్బోచితంగాను, అసందర్భోచితంగాను క్యాజువల్‌గా మాట్లాడిన పలు సందర్భాల్లో ఆమె ఇబ్బందుల్లో పడినట్టు కనిపించారు. అయితే వాటికి ఆమె సమాధానం ఇవ్వడమే కాకుండా వాటికి ముగింపు పలికేలా చర్యలు తీసుకొన్నారు. తాజాగా టాప్ యాంకర్ ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో కూరుకుపోయారు. ఆ వివాదం వివరాల్లోకి వెళితే..
గోదావరి జిల్లాలోని రాజమండ్రి ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ భవన నిర్మాణాలను చేపట్టింది. ఈ వెంచర్ కోసం భారీగా ప్రమోషన్స్ చేసి వినియోగదారులను ఆకర్షించారు. దాంతో తమ కష్టార్జితాన్ని, రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి కూడబెట్టి ఈ వెంచర్‌లో ఫ్లాట్స్ కొనుగోలు చేశారు.

అయితే అట్టహాసంగా ప్రమోషన్స్ చేసిన సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ యాంకర్ సుమను తమ వెంచర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకొన్నారు. ఈ వెంచర్ కోసం సుమ వ్యాపార ప్రకటనల్లో నటించి.. తక్కువ ధరకే ఇంటిని సొంతం చేసుకొమని సలహాలు ఇచ్చింది. అయితే సుమ చెప్పడంతో చాలా మంది భారీగా డబ్బు పోసి ఫ్లాట్స్‌ను కొనుగోలు చేశారు.
అయితే గడువ తీరినా గానీ సదరు కంపెనీ వినియోగదారులుకు ఇంటిని హ్యాండోవర్ చేయకపోవడంతో పలు మార్లు ఆ సంస్థ చుట్టూ తిరిగారు. పలుమార్లు రిక్వెస్ట్ చేసిన సంస్థ నిర్వాహకులు స్పందించలేదు. చివరకు బిచాణా ఎత్తేసి పరారీలో ఉండటంతో వినియోగదారులు బాధితులుగా మారారు. చేసేది ఏమీ లేక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి చేతిలో ప్లకార్డులు పట్టుకొని రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. యాంకర్ సుమ ప్రచారం చేయడం వల్ల ఆకర్షితులమయ్యాం. పెద్ద కంపెనీ కావడంతో తక్కువ ధరకు ఇస్తానని అనడంతో మేము ఫ్లాట్స్‌ను కొనుగోలు చేశాం. అయితే సుమను తప్పు పట్టడం లేదు. కానీ ఆమె ప్రచారం చేయడం వల్లే మేము కొనుగోలు చేశాం. ఆమె మాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకొంటున్నాం. మేము 26 లక్షలు క్యాష్ ఇచ్చి రిజిస్టర్ చేసుకొన్నాం. పిల్లల భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టాం అని బాధపడ్డారు. యాంకర్ సుమ స్పందించాలని బాధితులు కోరుకొన్నారు.


Click it and Unblock the Notifications











