Suma Kanakala: స్టేజీమీదే కొడుకుపై సుమ ఫైర్ .. ఛీ అంటూ క్లాస్ పీకుతూ!
యాంకర్ సుమ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా ఈమె అక్కడ కచ్చితంగా ఉండాల్సిందే. సుమ లేకపోతే ఆ షోలో సందడి తగ్గినట్లు అనిపిస్తుంటుంది చాలా మందికి. అందుకే ఎక్కువగా ఈమెతోనే తమ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లు చేయించుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడూ కామెడీ చేసే ఈమె.. తాజాగా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చింది. అక్కడ స్టేజీమేద తన కొడుకు రోషన్ కనకాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛీ అవేం మాటల్రా.. ఇలాంటివి నీకెవరు నేర్పించారంటూ ఫైర్ అయింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వైవా హర్ష ప్రధాన పాత్రలో వస్తున్న సుందర మాస్టర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమ కనకాలను యాంకర్ గా పిలిచారు. అయితే ఎప్పటిలాగే.. సినిమా స్టైల్ లో యాంకరింగ్ చేసేందుకు వచ్చేసిందీ ముద్దుగుమ్మ. అయితే సినిమాలోని అనేక విషయాల గురించి చెబుతూ.. అందులోని నటీనటులును స్టేజీ మీదకు పిలుస్తూ.. చాలానే సందడి చేసింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమ కనకాల కొడుకు హీరో రోషన్ కనకాల కూడా వచ్చాడు. అయితే కొడుకును స్టేజీ మీదకు పిలిచిన సుమ చాలా గట్టిగా ఫైర్ అయింది.

ముందుగా ఇక్కడుకున్న స్టూడెంట్లలో రోషన్ కనకాల పైకి రావాలి అంటూ కళ్లద్దాలు.. పెట్టుకుని టీచర్ లా మాట్లాడుతూ పిలిచేసింది సుమ. బబుల్ గమ్ చూసేశాం.. నువ్వు పైకి రావాలంటూ వివరించింది. సినిమాలో హీరోగా చేసినంత మాత్రానా తప్పించుకోవడానికి వీళ్లేదు రా అంటూ పిలవగా.. వెంటనే స్టేజీ ఎక్కేశాడు రోషన్ కనకాల. అయితే ఈక్రమంలోనే వై ఆర్ యూ లేట్ టు ద క్లాస్ అంటూ సుమ.. రోషన్ ను అడిగింది. దీనికి వెంటనే రోషన్.. ఏంటమ్మా ఇంట్లో కూడా సావగొడ్తావ్.. ఇక్కడ కూడా సావగొడ్తావ్ అంటూ అనేశాడు.
దీనికి సుమ చాలా షాక్ అయింది. వెంటనే తేరుకుని చావగొట్టడం ఏంట్రాం... ఆ మాటలు ఏంట్రా అసలు అంటూ ఫైర్ అయింది. దీనికి రోషన్ నువ్వు ఇంట్లో టీచరే, ఇక్కడ కూడా టీచరే అంటూ అన్నాడు. దీనికి సుమ అవును మరి టీచర్ నే అంటూ చెప్పుకొచ్చింది. ముందు మీ నాన్నకు టీచర్ అయ్యాను, ఆ తర్వాత నీకు టీచర్ అయ్యానని తెలిపింది. ఎందుకు లేట్ గా వచ్చావని మరోసారి అడిగింది. దానికి ఏదో పని ఇచ్చావ్ గా అందుకే లేట్ అయిందని రోషల్ వివరించే ప్రయత్నం చేశాడు. నేను పనివ్వడం కాదు... నువ్వు ఏవో సొంత పనులు పెట్టుకుంటున్నట్లున్నావ్ అంటూ అడిగింది.

ఆ తర్వాత.. అవును నేను క్లాస్ లో నేర్పించింది ఏంటి నువ్వు స్కూల్లో చేసింది ఏంటంటూ అడిగింది. పళ్లుతోముకోకపోయినా... అంటూ బబుల్ గమ్ సినిమా డైలాగ్ ను గుర్తు చేసి.. అవేంట్రా అంటూ ప్రశ్నించింది. అది రవికాంత్ పేరెపు నేర్పించారు అని అనగానే.. వచ్చాడా ఆ కుర్రాడు అని అడిగింది. దీనికి రోషన్.. వస్తున్నాడు, ఆయన టైర్ పంక్చర్ అయిందంటూ చెప్పుకొచ్చాడు. ఇలా వీరిద్దరి మధ్య కన్వర్జేషన్ చాలా ఫన్నీగా సాగింది.


Click it and Unblock the Notifications











