Anchor Suma Son: పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సుమ కొడుకు... వీడియో తీయొద్దంటూ వార్నింగ్

యాంకర్ సుమ కనకాల.. తన మాటలు, చలాకీ తనంతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక గత దశాబ్దంగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆమె కొడుకు రోషన్ కనకాల బబుల్ గమ్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు కూడా పెట్టేశాడు. ఇదిలా ఉంటే తాజాగా రోషన్.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. దొరికిపోవడంతో.. వీడియో తీయొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడు.ఆ వివరాలు ఈ స్టోరీలో ఉన్నాయి.

టాలీవుడ్ యాంకర్ సుమ తనయుడు రోషన్‌ కనకాల హీరోగా సినీ పరిశ్రమలోకి త్వరలోనే అడుగుపెట్టబోతున్నాడు. ఈ విషయం ఇప్పటికే అందరికీ తెలిసిందే. రోషన్ కనకాల 'బబుల్ గమ్' అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతే కాదు... ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటుంది.

Anchor Suma Kanakala Son Roshan Wrong Behavior With Police Video Goes Viral

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే... టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ.. ప్రేక్షకులకు హైప్స్ పెంచుతున్నారు. ఇది ఇలా ఉంటే... తాజాగా సుమ కొడుకు రోషన్ కనకాల పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అంతే కాదు.. పోలీసులకు వార్నింగ్ ఇస్తూ రెచ్చిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుమ కొడుకు అడ్డంగా దొరికిపోయాడంటూ నెట్టింట హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఈ మధ్య కాలంలో మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. అదే తరహాలోనే రోషన్ తన బబుల్ గమ్ సినిమాను ప్రమోట్ చేయాలనుకున్నారు. తన సినిమా ప్రమోషన్స్ కోసం పోలీసులతో గొడవకు దిగాడు ఈ కుర్ర హీరో. అయితే వాళ్ళు నిజమైన పోలీసులు కాదు.. వాళ్లు కూడా ఆర్టిస్టులే. 'బబుల్ గమ్' సినిమా ప్రమోషన్స్ కోసం రోషన్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోలో సుమ కొడుకు యాక్టింగ్, కామెడీ ఆకట్టుకుంది. వీడియో తీయొద్దంటూ పోలీసులకు ఇచ్చిన వార్నింగ్.. ఇలా మొత్తంగా సినిమాను డిఫరెంటుగా ప్రమోట్ చేశారు బబుల్ గమ్ టీమ్. ఇక బబుల్ గమ్ సినిమాకు రవి కాంత్ పేరెపు దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల వంటి సినిమాలు తీసి సూపర్ హిట్టులను అందుకున్నాడు. ఇప్పుడు బబుల్ గమ్ సినిమాతో రాబోతున్నాడు.

ఇక ఈ సినిమాకు చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. రోషన్ కనకాల సరసన మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి సినిమాలోనే రోషన్ తో రొమాన్స్ చేసింది ఈ హీరోయిన్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించింది. ఇప్పటికే ఈ సినిమా కోసం నాని, రాజమౌళి రంగంలోకి దిగారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మూవీ. మరి ఈ సినిమాతో రోషన్ కెరియర్ మారబోతుందా లేదా అనేది చూాడాలి.

More from Filmibeat

Read more about: anchor suma roshan tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X