Bro Eventలో షాకింగ్‌గా అతని స్పీచ్.. తట్టుకోలేక పక్కకు వెళ్లిపోయిన సుమ
ఒక సినిమా ముహుర్తం నుంచి సక్సెస్ మీట్ వరకు ప్రమోషన్స్ లలో జోరు చూపిస్తుంటారు. ఇక సినిమా థియేటర్లలో విడుదలకు రెడీ అవడానికి ముందు ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో మూవీ గురించి వీలైనంత ఎక్కువగా ప్రచారం చేసేందుకు ప్లాన్ చేస్తారు మేకర్స్. ఇక వీటిల్లో నటీనటులు, హాజరైన అతిథులు చెప్పే మాటలు ఆసక్తిగా, ఎమోషనల్ గా, కొన్నిసార్లు కామెడీగా ఉంటాయి. అలా తాజాగా జరిగిన పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ గెస్ట్ మాట్లాడిన మాటలకు యాంకర్ సుమ పక్కకు తప్పుకుని వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. అసలు ఏమైందనే వివరాల్లోకి వెళితే..
బ్రో డైలాగ్స్:ఎన్నో అంచనాలతో జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ సినిమా బ్రో. ఈ సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహించగా.. స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాధ్యతలు చేపట్టారు. ఇక సంగీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించారు.

కేతికా అలా.. ప్రియా?:బ్రో సినిమాలో ముద్దుగుమ్మలు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ కు గర్ల్ ఫ్రెండ్ గా కేతిక శర్మ చేస్తోందని తెలుస్తోంది. అయితే ప్రియా ప్రకాష్ వారియర్ పాత్రపై ఎలాంటి క్లారిటీ రాలేదు. వీళ్లతోపాటు బ్రహ్మానందం, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నార్త్ సుందరి ఊర్వశి రౌటెలా ఐటమ్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
హోస్టింగ్ గా:ఇక బ్రో సినిమాకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్. ఇక జూలై 25 హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమా నటీనటులు అంతా హజరు కాగా.. యాంకర్ సుమ హోస్టింగ్ బాధ్యతలు చేపట్టారు.

అలాంటి ఏకైక హీరో:
బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తోపాటు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై ఆయన మాటలకు ప్రేక్షకులతోపాటు యాంకర్ సుమ తట్టుకోలేకపోయారు. అయితే స్పీచ్ మొదలు పెట్టిన టీజీ వెంకటేష్ ముందుగా పవన్ కల్యాణ్ గురించి గొప్పగా చెప్పారు. అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నా.. వాటిని బ్యాంకుల్లో పెట్టుకోకుండా సమాజ సేవకు ఉపయోగించే ఏకైక హీరో అని పొగిడారు.

తప్పుతప్పుగా పేర్లు:అనంతరం చిటీ చూసుకుంటూ స్పీచ్ వదిలారు టీజీ వెంకటేష్. స్పీచులో డైరెక్టర్ సముద్రాల అని ఆయన అన్నారు. దీంతో పక్కనే ఉన్న సుమ కరెక్ట్ గా చెప్పడంతో సముద్ర ఖని అన్నారు. తర్వాత సహా హీరో ధర్మ తేజ (సాయి ధరమ్ తేజ్), మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా (తమన్), హీరోయిన్ కీర్తి శర్మ (కేతికా శర్మ) అని టీజీ వెంకటేష్ మాట్లాడారు. దీంతో ప్రేక్షకులంతా గొల్లున నవ్వడం, అరవడం మొదలు పెట్టారు.
అదే కారణం:టీజీ వెంకటేష్ మాటలకు పక్కనే ఉన్న సుమ నవ్వు ఆపుకోలేక పక్కకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో, ఆయన స్పీచ్ వైరల్ అవుతుంది. చిటీలో ఉన్నదాన్ని చూసి కూడా సరిగా చదవలేదని ఆయనపై ట్రోలింగ్ జరుగుతోంది. అయితే టీజీ వెంకేటేష్ కు చిత్ర పరిశ్రమతో పెద్దగా టచ్ లేకపోవడం, వ్యాపారం, రాజకీయాలతో బిజీగా ఉండే ఆయనకు అలా మాట్లాడటానికి కారణం అని కూడా పలువురు అంటున్నారు.


Click it and Unblock the Notifications











