Globe Trotter: రాజమౌళికి బిగ్ షాక్.. ఆ వీడియో లీక్ చేసిన సుమ..

Globe Trotter Event: ఎస్‌.ఎస్‌. రాజమౌళి - మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్‌ వరల్డ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (గ్లోబ్ ట్రాట్టర్). ఈ మూవీపై తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ మెగా ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎత్తున జరుగబోతుంది. గతంలో ఎప్పుడూ చూడని స్థాయిలో.. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్, మహేశ్ లుక్ రివీల్, గ్లోబల్ స్కేల్ ప్రెజెంటేషన్ జరగనున్నది. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్‌ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళికి స్టార్ యాంకర్ సుమ కనకాల బిగ్ షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగింది?

ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్‌ వరల్డ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (గ్లోబ్ ట్రాట్టర్). ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా, ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై హైప్ పెంచేలా పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాల ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు జక్కన్న. దాంతో ఎస్ఎస్ఎంబీ 29పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Anchor Suma Leaks Globe Trotter Content Big Shock to Rajamouli Ahead of SSMB29 Mega Event

ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన గ్లోబ్ ట్రాట్టర్ అనే మెగా ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎత్తున జరుగబోతుంది. ఈ గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌కు సుమ కనకాల, యూట్యూబ్ స్టార్ ఆశీష్ చాంచలానీ హోస్ట్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి ఇద్దరితో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఈవెంట్ స్ట్రక్చర్, స్టేజ్‌పై ఎలా మాట్లాడాలి, ప్రేక్షకులను ఎలా ఇన్వాల్వ్ చేయాలి, మహేశ్ బాబు లుక్, టైటిల్ రివీల్‌కు ముందు ఏ మాటలు చెప్పాలి వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా సూచనలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు, కొన్ని కీలక పాయింట్లు, స్క్రిప్ట్ లాంటి కంటెంట్‌ను వారికి షేర్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ చర్చలకు సంబంధించిన ఒక చిన్న క్లిప్ ను సుమ వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సుమ లీక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రాజమౌళి టీమ్‌ను షాక్‌కు గురిచేసినట్టు వార్తలొస్తున్నాయి. ఆ వీడియోలో రాజమౌళి వివరించే కొన్ని సూచనలు, ఈవెంట్ ప్రారంభం ఎలా ఉండాలి, గ్లోబ్ ట్రాట్టర్‌ను ఎలా ప్రెజెంట్ చేయాలి వంటి వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వీడియో ఎస్ఎస్ఎంబీ మూవీ టీంని చూడవచ్చు. ఆ వీడియోలో కీరవాణీ ( పెద్దన్న) ముసుగు కప్పుకుని ఉండటం కాస్త ఫన్నీగా ఉంది. అయితే.. రాజమౌళి పనిలో లీక్ అనే పదమే ఉండదు. RRR సమయంలో కూడా ఓ ఈవెంట్ సమయంలో రెండు రోజులు పాటు రిహార్సల్స్ చేయించారని టాక్. అలాంటి వ్యక్తి ఈవెంట్‌కు ఇచ్చిన కంటెంట్ బయటపడ్డ విషయం ఆయన్ను ఆశ్చర్యానికి గురిచేసినట్టే కనిపిస్తోంది.

మరోవైపు ఈవెంట్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న సమయంలో ఈ లీక్ మళ్లీ ఆసక్తిని రెట్టింపు చేసింది. జియో - హాట్‌స్టార్ ఈవెంట్ హక్కులు కొనుగోలు చేసిన నేపథ్యంలో గ్లోబ్ ట్రాట్టర్‌ను గ్లోబల్ స్థాయి స్పెక్టకల్‌గా ప్రెజెంట్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ఉన్న నేపథ్యంలో ఈవెంట్ వాయిదా పడుతుందా? అన్న అనుమానాలకు స్వయంగా రాజమౌళి స్పందిస్తూ ఈవెంట్ యథావిధిగా జరుగుతుందని, అయితే భద్రత విషయాల్లో అత్యంత కఠిన నిబంధనలు అమలు చేస్తామని తెలిపాడు.

యాంకర్ సుమ - ఆశీష్‌లతో రాజమౌళి జరిపిన మీటింగ్‌కు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు "జక్కన్న పర్ఫెక్షనిస్ట్... సుమ లీక్‌తో కూడా హైప్ పెరిగింది!", "గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ కచ్చితంగా ప్రపంచ స్థాయిలో కొట్టేస్తుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ లీక్ నిజంగానే సుమ నుంచి వచ్చిందా? లేక సోషల్ మీడియాలో సృష్టించిన ప్రచారమా? అనే దానిపై అధికారిక స్పందన లేకపోయినా, ఈ వీడియో ఈవెంట్‌పై ఉన్న ఆసక్తిని మరింత పెంచినట్టే కనిపిస్తోంది.

ఇప్పటికి గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. మహేశ్ బాబు లుక్ ఎలా ఉండబోతోంది? టైటిల్ ఏంటన్నదిపై ఉన్న సస్పెన్స్‌తో పాటు సుమ వీడియో లీక్ ఎపిసోడ్ కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా నిలిచింది. నేటీ గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ తో అన్ని మిస్టరీలు వీడిపోనున్నాయి. ఈ ఈవెంట్ కోసం.. మహేశ్ బాబు అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆ క్షణం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.మొత్తానికి ఈ ఈవెంట్ ఓ సంచలనమే అని చెప్పాలి.

More from Filmibeat

Read more about: ssmb 29 ss rajamouli suma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X