డ్యాన్స్‌తో కుక్కకు పిచ్చెక్కించిన యాంకర్ సుమ.. వీడియో వైరల్!
టాలీవుడ్ ఆల్ టైమ్ బెస్ట్ యాంకర్ ఎవరంటే.. ఎక్కువగా వినిపించే పేరు సుమ కనకాల. స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మొదటగా కనిపించేది సుమనే. అయితే సోషల్ మీడియాలో సుమకు ఫాలోవర్స్ కూడా గట్టిగానే పెరుగుతున్నారు. లాక్ డౌన్ లో ఆమె ఫ్యామిలీతో సరదాగా గడుపుతు.. అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ మూమెంట్స్ ని ఆడియెన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ఇకపోతే రీసెంట్ గా సుమ చేసిన ఒక డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Recommended Video

లాక్ డౌన్ ఎఫెక్ట్..
కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే యాంకర్ సుమ ఇంట్లో ఎక్కువగా ఉండేది కాదు. రోజుకు నాలుగైదు షూటింగ్ లతో బిజీబిజీగా ఉండేవారు. రియాలిటీ షోలు గేమ్ షోలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సక్సెస్ ఈవెంట్స్ అని బిజీగా ఉండేవారు. లాక్ డౌన్ వల్ల సినిమా పరిశ్రమలో చాలా వరకు పనులు ఆగిపోవడంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. కెరీర్ ఊపందుకున్న తరువాత సుమ ఎన్నడు ఈ రేంజ్ లో ఖాళీగా ఉండలేదట.

సుమక్క యూ ట్యూబ్..
బుల్లితెరకు దూరమైనప్పటికి యాంకర్ సుమ కెమెరాకు మాత్రం దూరం కావడం లేదు. ఇంట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే ఓ వైపు ఆడియెన్స్ ని పలకరించే ప్రయత్నం చేస్తోంది. సుమక్క యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా రోజు సరికొత్త విషయాలను చెబుతూ ఓ విదంగా సపరేట్ ఆదాయాన్ని కూడా అందుకుంటోంది.
View this post on Instagram#Longtimenoworkeffects , zorro is mad at me
A post shared by Suma Kanakala (@kanakalasuma) on
డ్యాన్స్ వీడియో వైరల్..
ఇక చాలా రోజుల తరువాత సుమ ఒక డ్యాన్స్ వీడియోతో ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. రాములో రాములా.. పాటకు తనదైన శైలిలో స్టెప్పులు వేసిన సుమ వీడియోలో తన పెంపుడు కుక్కను కూడా చూపించింది. డ్యాన్స్ చేస్తుంటే 'జోరో' తనను పిచ్చిగా చూస్తోంది అంటూ సుమ తన పెంపుడు కుక్కపై కామెంట్ చేసింది. చాలా రోజుల నుంచి వర్క్ లేకపోవడంతోనే ఈ ఎఫెక్ట్ అనేలా ఒక హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చింది.

పాజిటివ్ కామెంట్స్..
యాంకర్ సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారుతోంది. ఇక నెటిజన్స్ కూడా సుమ డ్యాన్స్ వీడియోపై సరదాగా కామెంట్ చేస్తున్నారు. కుక్కకు పిచ్చెక్కిస్తున్నారు అంటూ.. అది కూడా డ్యాన్స్ చేయాలని చూస్తోంది అని పాజిటివ్ గా కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications











