Anchor Suma నిండు క్షమాపణ కోరుతున్నా.. సారీ చెబుతూ సుమ వీడియో రిలీజ్

తెలుగు సినిమా రంగంలో తన ప్రతిభతో సినీ వర్గాలను, ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న యాంకర్ సుమ అప్పుడప్పుడు ఫ్లోలో కంట్రోల్ తప్పుతుంటారు. ఈవెంట్లను రక్తి కట్టించడానికి హీరోలు, హీరోయిన్లను, ఆర్టిస్టులపై పంచులు విసిరుతూ అందరి దృష్టిని తనపై నిలుపుకొనేలా చేస్తారు. కొన్నిసార్లు ఆమె వ్యాఖ్యలు కొందరిని బాధించినప్పటికీ.. మరొ కొన్నిసార్లు చూసి చూసికుండా వదిలేస్తారు. అయితే ఆదికేశవ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో మీడియాపై యాంకర్ సుమ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తన తప్పును తెలుసుకొని ఆమె వివరణ ఇస్తూ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో వివరాల్లోకి వెళితే..

ఆదికేశవ సినిమా పాట రిలీజ్ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో జరిగింది. ఈవెంట్ కోసం పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, దర్శకుడు హాజరయ్యారు. ఈ సినిమా ఈవెంట్‌కు యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే ఈవెంట్ ఆలస్యం అవ్వడంతో ఆమె తన నోటికి పని చెప్పారు. హద్దు దాటి కొంత ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు.

 Anchor Suma renders unconditional apology to Media at Adikeshava Event Issues

సుమ ఈవెంట్‌ను ఆరంభిస్తూ.. ఎవరైతే బయట మేము పెట్టిన స్నాక్స్‌ను స్నాక్స్‌లా కాకుండా భోజనంలా తింటున్నారో.. వారు తొందరగా లోపలికి వచ్చి కెమెరాలు పెట్టండి. బాబు మీరు కెమెరా పెట్టారు కదా.. మీరు ఓ ముగ్గురికి చెప్పండి.. వాళ్లు మరో ముగ్గురికి చెబుతారు. తొందరగా కెమెరాలు తీసుకురండి అంటూ మీడియా కెమెరామెన్లపై సెటైర్ వేశారు.

అయితే సుమ వ్యాఖ్యలతో ఇబ్బంది పడిన మీడియా రిపోర్టులు ఆమె నోటి దురుసుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓ మీడియా ప్రతినిధి మాట్లాడుతూ.. ఈవెంట్‌ స్టార్ట్ చేసేటప్పుడు స్నాక్‌ను భోజనంలా చేస్తున్నారు అనకుండా ఉండాల్సింది అని అంటే.. మీరు స్నాక్స్‌ను స్నాక్స్ మాదిరిగానే తిన్నారు అంటూ సుమ మళ్లీ పంచ్ వేయబోయింది. దాంతో మీరు ఇలాంటివే మీడియాను అనకుండా ఉండే బాగుంటుంది అని మీడియా ప్రతినిధి సమాధానం చెప్పారు.

 Anchor Suma renders unconditional apology to Media at Adikeshava Event Issues

మీడియాపై సుమ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఈవెంట్ జరుగుతుండగానే యాంకర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో వివాదంగా మారుతుందని గ్రహించిన ఆమె వ్యక్తిగతంగా స్పందించారు. తన తరఫున వీడియోను రిలీజ్ చేశారు.

ఆదికేశవ ఈవెంట్‌లో నేను చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు నాకు అర్ధమైంది. నిండు మనసుతో క్షమాపణ కొరుతున్నాను. మీరు ఎంత కష్టపడి పనిచేస్తారో నాకు తెలుసు. మీరు, నేను కలిసి ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాం. కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని అనుకొంటున్నాను అని వీడియోలో సుమ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X