Rajeev Kanakala: పుట్టిన రోజు సందర్భంగా భార్యను అడిగి మరీ ఆ పని చేసిన రాజీవ్ కనకాల.. వీడియో వైరల్!
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు, ముఖ్యంగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమ పుట్టింది కేరళలోనే అయినా అచ్చమైన తెలుగు అమ్మాయిలా, స్వచ్ఛమైన తెగులు భాష మాట్లాడుతూ... యాంకర్ గా ఇరగదీస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకూ సుమ అంచే ఇష్టపడతారు. అలాగే హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాజీవ్ కనకాల ఆయనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు.
వీరిద్దరి బంధం గురించి, వీరి మధ్య ప్రేమానుబంధాల గురించి కూడా అందరికీ బాగా తెలుసు. గతంలో వీరిద్దరూ విడిపోయారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ రాజీవ్ ఓసారి స్పందించి ఓ వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కొన్నాళ్లు వేరుగా ఉన్న మాట వాస్తవమే అయినా తాము విడిపోలేదని ప్రకటించారు. ఆ తర్వాత నుంచి చాలా చోట్ల వీరిద్దరూ కలిసే కనిపిస్తున్నారు. అలాగే సుమ యూట్యూబ్ ఛానెల్ లో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ అలరిస్తున్నాడు. అయితే ఈరోజు సుమ తన భర్త గురించి ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది.

ముఖ్యంగా ఈరోజు రాజీవ్ కనకాల పుట్టిన రోజు. ఈక్రమంలోనే యాంకర్ సుమ తన భర్త పుట్టిన రోజును జరిపింది. కేక్ తీసుకొచ్చి మరీ స్పెషల్ గా కట్ చేయించింది. ఎల్లో కలర్ చీర కట్టుకున్న సుమ కనకాల.. బ్లూ కలర్ సింపుల్ టీషర్టు వేసుకున్న భర్తతో చాకోలెట్ కేక్ కట్ చేయించింది. పక్కనే కూర్చొని మరీ హ్యాపీ బర్త్ డే టు యూ.. హ్యాపీ బర్త్ డే డియర్ రాజా అంటూ పాట పాడింది. ఇలా రాజీవ్ కనకాల కేక్ కట్ చేశాడు. ఆ తర్వాత సుమకు కేక్ తనిపించాడు. సుమ కూడా రాజీవ్ కు కేక్ తినిపించింది.
ఆ తర్వాత సుమ రాజీవ్ కనకాలను కౌగిలించుకుంది. కానీ రాజీవ్ కనకాల మాత్రం అటు పక్కన ఉన్న వేరే వాళ్లకు కేక్ పెట్టబోయాడు. ఆ తర్వాత ఈ విషయం గుర్తించిన రాజీవ్ కనకాల.. ఎక్కడ భార్య హర్ట్ అవుతుందో అనుకొని వెంటనే భార్యవైపు తిరిగాడు. ఇందాక ఏదో చేస్తున్నావు నేను అటు తిరిగి ఉన్నానని చెప్పాడు. ఇలా మరోసారి కౌగిలించుకుందాం అనగానే.. సుమ పడీపడీ నవ్వింది. వెంటనే భర్తను హత్తుకుని మురిసిపోయింది.
సుమ కాసేపటి క్రితమే ఈ వీడియో షేర్ చేయగా నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. వీరిద్దరి మధ్య రిలేషన్ చూసి తెగ సంబర పడిపోతున్నారు. జీవితాంతం మీరిద్దరూ ఇలాగే కలిసి ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు. లైకులు, షేర్లు, కామెంట్లు చేస్తూ వీడియోను వైరల్ గా మారుస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ వీడియో చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











