నువ్వు బాత్రూంలో ఏం చేస్తావంటూ హీరోను అడిగేసిన యాంకర్ సుమ.. అదే చేస్తానంటూ షాకింగ్ రిప్లై!
అచ్చమైన తెలుగుంటి కోడలు అయిన యాంకర్ సుమ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్బుతమైన మాటలతో అందరినీ అలరించే ఈమెకు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత పద్ధతిగా నడుచుకోవాలనేది చాలా బాగా తెలుసు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హీరోను షాకింగ్ ప్రశ్న అడిగింది. ముఖ్యంగా నువ్వు బాత్రూంలో ఆ పని చేస్తావా అంటూ అడిగేసింది. దీంతో అందరూ షాక్ కాగా.. హీరో మరింత షాకయ్యే సమాధానం చెప్పాడు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతమైన సినిమమా ఆ ఒక్కటి అడక్కు గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతైమ కాన్సెప్ట్ తో వచ్చి అందరినీ మెప్పించిన ఈ సినిమా టైటిల్ తోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈవీవీ తనయుడు, హీరో అల్లరి నరేష్. అయితే ఈ సినిమాలో ఫరియా అబ్ధుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే వెన్నెల కిశోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరి సహా పలువురు నటిస్తన్నారు.

మల్లి అంకమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను చిలకా ప్రొడక్షన్స్బ్యానర్పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. గోపి సందుర్ సంగీతం అందిస్తున్నారు. సూర్య డీఓపీ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే మే 3వ తేదీన థియేటర్లలో గ్రాండ గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. ప్రతీ ఒక్కరూ ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాలనుకుంటున్నారు. అయితే మూవీ టీం కూడా ఈ సినిమాపై బజ్ పెంచేందుకు పెద్ద ఎత్తునే ప్రయత్నాలు చేస్తున్నారు.
హీరోహీరోయిన్లతో పాటు దర్శక, నిర్మాతలు కూడా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ తెగ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా హీరో అల్లరి నరేష్ తో పాటు హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా యాంకర్ సుమ చేస్తున్న ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈక్రమంలోనే యాంకర్ సుమ షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా హీరో అల్లరి నరేష్ తో మాట్లాడుతూ.. మీరు బాత్రూంలో ఏం చేస్తారని ప్రశ్నించింది. దీనికి అల్లరి నరేష్ షాక్ అవ్వగా.. వెంటనే సము అంటే బాత్రూంలో పాటలు పాడుతారా, డ్యాన్స్ చేస్తారా, డైలాగ్ లు ప్రాక్టీస్ చేస్తారా అని అడిగింది.

దీనికి అల్లరి నరేష్ అవేవీ చేయను.. కేవలం బాత్రూంలో స్నానం మాత్రమే చేస్తానని సమాధానం చెప్పాడు. ఆయన చెప్పిన సమాధనంతో అంతా ఒక్కసారిగా నవ్వేశారు. సుమ మాత్రం కాస్త మొహం మాడ్చుకుని.. ఓకే ఓకే అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది. ముఖ్యంగా ఈ వీడియోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యూట్యూబ్ లో పెట్టగా వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











