Bubblegum Free Tickets: థియేటర్లలో ఫ్రీగా సుమ కొడుకు సినిమా... కాకపోతే వారికి మాత్రమే!
ఇండస్ట్రీలోకి మరో కొత్త వారసుడు వచ్చిన సంగతి తెలిసిందే. యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బబుల్ గమ్ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి ఆరంగేట్రం చేశాడు. అయితే ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ అయి.. మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను రెండు రోజుల పాటు ఫ్రీగా ప్రదర్శించనున్నారు. అది కూడా కొందరికి మాత్రమే. ఈ సినిమాను ఫ్రీగా ఎక్కడ ఎప్పుడు చూడాలో.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా తెరకెక్కిన చిత్రం బబుల్ గమ్. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్.. మొదటి సినిమాకే మంచి పేరును కైవసం చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా ట్రైలర్, పాటలు రిలీజ్ అయ్యాక మంచి ఆదరణ వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా నిన్న అనగా డిసెంబర్ 29న రిలీజ్ కాగా.. మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. పూర్తిస్థాయి యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను రూపొందించారు.
ఇక ఈ సినిమా యువతరాన్ని ఎట్రాక్ట్ చేసేలా ఉండగా.. యూత్ కి బాగా కనెక్ట్ అయిందనే చెప్పాలి. ఇక లిప్ లాక్స్ తో కుర్ర జంట రెచ్చిపోగా.. కాస్త ఫ్యామిలీ ఆడియెన్స్ కు మాత్రం ఈ సినిమా రూచించడం లేదు. ఇక ఆ విషయం పక్కన పెడితే... ఈ సినిమాకి ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది.

ఈరోజు అనగా డిసెంబర్ 30 సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు అనగా డిసెంబర్ 31న సాయంత్రం ఆరు గంటల వరకు స్టూడెంట్స్ కి ఈ ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్టు తెలిపారు మేకర్స్. అయితే అన్ని థియేటర్స్ కాదు... కొన్ని సెలెక్టడ్ థియేటర్స్ లో 18ప్లస్ స్టూడెంట్స్ కి ఈ సినిమా ఫ్రీగాచూసే అవకాశం కల్పించారు. ఈరోజు ఆరు గంటలకి అయితే వైజాగ్ చిత్రాలయ మాల్, భీమవరం విజయలక్ష్మీ థియేటర్, విజయవాడ లైలా మాల్, ఎన్వీఆర్ వేల్రామ్స్ థియేటర్ తిరుపతిలో షోలు ఫ్రీగా చూడొచ్చు.
ఇక రేపు అనగా డిసెంబర్ 31 బబుల్ గమ్ సినిమాను హైదరాబాద్ శాంతి, మూసాపేట్ లక్ష్మీకళ, కొంపల్లి సినీ ప్లానెట్, అమీర్ పేట AAA సినిమాస్, కుషాయి గూడ తాళ్ళూరి థియేటర్ లలో చూసే అవకాశం కల్పించారు మేకర్స్. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కనుక ఆ ప్లేసుల్లో ఉంటే... లేదా మీ ఫ్రెండ్స్ కనుక ఉంటే వెంటనే ఈ విషయాన్ని షేర్ చేయండి. ఫ్రీగా సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











