బిగ్ బాస్ షో చేయడం కష్టం, పిచ్చి పిచ్చి జోకులు వేయాల్సి ఉంటుంది: నాగార్జున

సినిమాల్లో నటించడం కంటే యాంకరింగ్ చేయడం కష్టంగా ఉంటుంది అంటున్నారు అక్కినేని నాగార్జున. తన తాజా చిత్రం 'మన్మధుడు 2' సినిమా ప్రమోషన్లో భాగంగా యాంకర్ సుమతో ఆయన ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ షో ప్రస్తావన వచ్చింది. ఇద్దరి మధ్య సంభాషణ క్రింది విధంగా జరిగింది.

సుమ: ఇది మాత్రం కరెక్టుగా లేదండీ.. మీకు ఇంత బాగా యాంకరింగ్ చేయడం ఏం బాగోలేదు

నాగార్జున: బావుందా? బాగోలేదా?

సుమ: నచ్చట్లేదు మాకు.. ఎందుకు మీరు అంతబాగా యాంకరింగ్ చేస్తున్నారు? మేము ఎత్తి చూపడానికి ఏమైనా తప్పులు మాకు దొరకాలిగా...

నాగార్జున: యాంకరింగ్ కష్టం.. అక్కడ ఎదుటివారి రియాక్షన్ బట్టి యాంకరింగ్ చేయాల్సి ఉంటుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు షో చేసినపుడు నేను ఇదే ఫేస్ చేశాను. వారు సైలెంటుగా ఉంటే మనం ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. అది ఇంకా కష్టంగా ఉంటుంది. అప్పుడు పిచ్చి పిచ్చి జోకులు కూడా వేయాల్సి ఉంటుంది.

Anchoring is more difficult than acting: Nagarjuna about Bigg Boss

సుమ: హీరోగా నటిస్తూ సినిమా నిర్మాతగా ఉండటం వల్ల మీకు అదనపు బాధ్యతగా, ఒత్తిడిగా అనిపించదా?

నాగార్జున: నాకు అలా చేయడం ఇష్టం. అదనపు బాధ్యతగా ఎందుకు అనిపించదు అంటే... షూటింగ్ సమయంలో నేను నిర్మాతగా ఇన్వాల్వ్ అవ్వను. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలోనే ఇన్వాల్వ్ అవుతాను.

మన్మధుడు 2 మూవీ విషయానికొస్తే... నాగార్జున అక్కినేని, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా నటించిన ఈ చిత్రాన్ని మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వం వహించారు. ఆగస్టు 9న ఈ చిత్రం విడుదలకాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X