మహా కుంభమేళాలో సతీసమేతంగా పవన్ కల్యాణ్.. త్రివేణి సంగమంలో అకీరా, త్రివిక్రమ్‌తో కలిసి..!

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయోగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాన్ని ఆచరించడానికి హిందూ సంప్రదాయవాదులు పొటెత్తారు. జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి పర్వదినం వరకు కొనసాగుతుంది. గంగా, యుమున, సరస్వతి నదుల సంగమంలో స్నానమాచరించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. అయితే ఈ మేళాలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజెనోవా, ఆయన కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మంగళవారం స్నానం ఆచరించారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రాజకీయ నేతలు, సినీ తారలు, సాధారణ ప్రజలు భారీగా కుంభమేళాలో పాల్గోన్నారు. లక్షలాది మంది పుణ్య స్నానాన్ని ఆచరించారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సిబ్బందితో కలిసి త్రివేణి సంగమంలో మునక వేశారు. ఆయన వెంట సతీమణి, కుమారుడు, త్రివిక్రమ్ గంగానదిలో స్నానం చేశారు. అనంతరం త్రివేణి సంగమంలో హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు.

Andhra Deputy CM Pawan Kalyan take holy dip with Akira Nandan Trivikram at Prayagraj of Maha Kumbh Mela 2025

ఇటీవల ఏపీ నుంచి మంత్రి నారా లోకేష్ కూడా తన భార్య, కుమారుడితో కలిసి త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ తారలు కూడా ఈ మేళాలో భాగమయ్యారు. ఈ కుంభమేళాకు అనూహ్యమైన స్పందన వ్యక్తమవుతున్నది.

Andhra Deputy CM Pawan Kalyan take holy dip with Akira Nandan Trivikram at Prayagraj of Maha Kumbh Mela 2025

ఇదిలా ఉండగా, భారత దేశ జనాభా సుమారుగా 143 కోట్లు. అందులో 110 కోట్ల మంది సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు. అందులో నుంచి సుమారుగా 50 కోట్ల మంది ఈ మేళాలో భాగమయ్యారు. కుంభ మేళా చివరి రోజు వరకు ఆ సంఖ్య 60 కోట్లకు చేరుకొంటుందని వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ జనాభాలో 50 శాతం మంది త్రివేణి సంగమంలో స్నానం ఆచరించారు అని వెల్లడించారు.

అత్యధిక మంది భక్తులు పాల్గొన్న ఈవెంట్‌గా కుంభమేళా రికార్డు సృష్టిస్తుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అంచనా వేశారు. ఈ మేళాలో మౌనీ అమావాస్య రోజున అత్యధిక మంది అంటే సుమారుగా 8 కోట్ల మంది భక్తులు తరలి వచ్చి త్రివేణి సంగమంలో స్నానం చేశారని అధికారులు తెలిపారు.

More from Filmibeat

Read more about: pawan kalyan akira nandan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X