AP, Telangana Elections and Voting Live.. లైన్‌లో నిలబడి ఓటు వేసిన జూనియర్ ఎన్టీఆర్

తెలుగు రాష్ట్రాల్లో ఓటరు చేతిలో ఓటు ఆస్త్రం రాజకీయ నేతల తల రాతలను మార్చే సమయం ఆసన్నమైంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికి ఓటరు పట్టం కట్టబోతున్నాడనే విషయం ఆసక్తిగా మారింది. ఇప్పటికే పలు సర్వేలు అధికార పార్టీకి వ్యతిరేకంగా రాగా.. పవన్ కల్యాణ్, చంద్రబాబు కూటమికి భారీ మెజారిటీ లభించబోతుందనే విషయాన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓటరు తీర్పు కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు ఎవరికి? ఎక్కడ? ఓటు వేయబోతున్నారనే వివరాల్లోకి వెళితే..

మాదాపూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకొన్న హీరో నాని. నేచురల్ స్టార్ వెంట ఆయన సతీమణి కూడా ఓటు వేశారు.

Telangana Elections Live

హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో సూపర్ ష్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ ఓటు వేశారు. సాధారణ పౌరుడిగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఎలాంటి ఆర్బాటం లేకుండా ఓటు హక్కు వినియోగించుకొన్నారు.

హీరో సాయి శ్రీనివాస్, నిర్మాత బెల్లంకొండ సురేష్ తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకొన్నారు. జూబ్లీ హిల్స్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి దేశ పౌరులిగా తమ భాద్యను నిర్వర్తించారు.

Telangana Elections Live

హీరో సుధీర్ బాబు తన భార్య, సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి ప్రియతో కలిసి ఓటు హక్కు వినియోగించుకొన్నారు. రాయదుర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేశారు.

  • జూనియర్ ఎన్టీఆర్, ఆయన సతీమణి ప్రణీతతో కలిసి తన ఓటు సమర్పించుకొన్నారు. జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఓటింగ్ కేంద్రంలో క్యూలో నిలబడి తన ఓటును సమర్పించుకొన్నారు. ఎన్టీఆర్‌తోపాటు ఆయన తల్లి కూడా ఓటు వేశారు.
Andhra Prades
  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటును ఉదయమే సమర్పించుకొన్నారు. ఆయన తన సిబ్బంది, స్నేహితులతో కలిసి జూబ్లిహిల్స్‌లోని ఓటింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
Allu Arjun
  • జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయం కాలనీలో గిరిజన సహకార సంస్ధ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున నారా లోకేష్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Andhra Pradesh and Telangana Elections Live Pawan Kalyan Ram Charan Chiranjeevi Jr NTR casting Vote Details
  • ఇక మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ క్లబ్‌లో ఉదయం 7 గంటలకే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆయనతోపాటు సతీమణి కొణిదెల సురేఖ కూడా ఓటు హక్కు వినియోగించుకొంటారు.
  • ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఆయన సతీమణి ఉపాసన కొణిదెల జూబ్లీ హిల్స్‌ క్లబ్‌లోనే మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకొంటారు.
Andhra Pradesh and Telangana Elections Live Pawan Kalyan Ram Charan Chiranjeevi Jr NTR casting Vote Details
  • మెగాస్టార్ చిరంజీవి తన భార్య కొణిదెల సురేఖతో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ క్లబ్‌లో ఓటు వేశారు. ఆయన క్యూ లైన్‌లో నిలబడి సాధారణ పౌరుడిగా ఆయన ఓటు వేశారు. తన వంతు వచ్చే వరకు ఆయన వేచి ఉండి ఓటు వేసి అందరికి స్పూర్తిగా నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X