RRR: ఆ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దురదృష్టవంతులు.. ఎందుకో తెలుసా?

చాలా కాలం నిరీక్షణ తర్వాత, RRR కొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తో దూసుకుపోతోంది. ఒకరకంగా బాహుబలి రికార్డులను కూడా ఈ సినిమా బద్దలు కొట్టిందని అంటున్నారు. అయితే RRR విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణ ప్రేక్షకులను దురదృష్టవంతులుగా పేర్కొనవచ్చు. అదేంటి అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే అసలు విషయం అంతా ఇక్కడ కథ ఉంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో RRR రౌద్రం రణం రుధిరం అనే పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు ఇప్పటికే భారీ ఎత్తున హైప్ క్రియేట్ అయింది.

Andhra Pradesh and telangana People Are Unluckiest regarding RRR

దానికి తగ్గట్టు ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్‌, పాటలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు రాజమౌళి. ఇందులో భాగంగానే భారీ సెట్టింగ్‌, యాక్షన్‌ సన్నివేశాలతో విజువల్‌ ట్రీట్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. RRR సినిమా యూనిట్ ఇచ్చే ఆ విజువల్‌ ట్రీట్‌ ను ఆస్వాదించాలంటే 3డీ వెర్షన్‌లో లేదా ఐమాక్స్ ఫార్మాట్ లోనో చూడాల్సి ఉంటుంది.

అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల విషయానికొస్తే, వారు RRR ని డాల్బీ విజన్ స్క్రీన్‌లు, IMAX స్క్రీన్‌లలో చూడవచ్చు. ఒకరకంగా RRR కి ది బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అవి మాత్రమే ఇవ్వగలవు. అంతేకాక వాళ్ళు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పోలిస్తే ఒకరోజు ముందే సినిమాను చూస్తారు. బెంగళూరులోని తెలుగు ప్రేక్షకులు కూడా పెద్దగా బాధ పడాల్సిన అవసరం లేదు.

RRR అర్ధరాత్రి షోలు 24వ తేదీ 11:50 PM నుండి ప్రారంభమవుతాయి కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా బాధ పడాల్సిన అవసరం లేదు. అయితే పాపం ఏపీ, తెలంగాణల్లోని తెలుగు సినీ ప్రేమికులు దురదృష్టవంతులు. ముందుగా ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో IMAX లేదా Dolby వంటి ప్రపంచ-స్థాయి ప్రొజెక్షన్ సదుపాయాలను పక్కన పెట్టండి పెద్ద సంఖ్యలో 3D స్క్రీన్‌లు కూడా లేవు.
దానికి తగ్గట్టు మార్చి 25 ఉదయం 6 గంటలకు ముందు ఎలాంటి బెనిఫిట్ షోలను ప్రదర్శించవద్దని స్థానిక అధికారులు థియేటర్ యాజమాన్యాలను ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రేక్షకుల విషయానికొస్తే, ఇక్కడ కూడా హైదరాబాద్ లో ఒకటి రెండు థియేటర్లు మినహా మిగతా ఎక్కగా IMAX లు లేవు.

దానికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు సినిమా కోసం అసాధారణమైన రేట్లకు టిక్కెట్లను కొనుక్కోవాల్సి వస్తోంది. RRR కి ఆంధ్ర ప్రదేశ్ సహా తెలంగాణ రాష్ట్రాల నుంచే ఎక్కువ వసూళ్లు రావాల్సి ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు అత్యధికులు IMAX లాంటి ఫీల్ పొందలేరు సరికదా అసలు అర్ధరాత్రి షోలు కూడా లేవు. ఇతర ప్రాంతాల్లో, మిగతా భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమాకు ఉన్న కారణంగా లోని రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రేమికులు దురదృష్టవంతులని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X