Andhra Pradesh Exit Polls 2024: నగరిలో వాడిపోనున్న రోజా.. ఓటమి తప్పదని తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణికి గడ్డుపరిస్థితిని ఎదుర్కుంటున్నట్టు ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టమైంది. జూన్ 13న ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ ఎన్నికల్లో ఓడిపోయే వారిలో రోజా పేరు ప్రముఖంగా వెల్లడించింది. అయితే రోజా గెలుపు, ఓటములపై ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన వివరాల్లోకి వెలితే..
నగరి నియోజకవర్గంలో మిక్స్‌డ్ ఫలితాలు రోజాకు వెల్లడయ్యాయి. మొదటిసారిగా 2004 సంవత్సరంలో టీడీపీ నుంచి రోజా పోటీ చేసి ఓటమిపాలైంది. ఇక 2014లో వైసీపీ పార్టీలో చేరిన ఆమె ఆ స్థానం నుంచి విజయం సాధించింది. ఆ తర్వాత 2019లో పోటీ చేసి మరో మారు విజయం సాధించడమే కాకుండా మంత్రి పదవిని కూడా చేపట్టారు.

అయితే మంత్రి పదవిని చేపట్టిన తర్వాత చిత్తూరు జిల్లాలో తీవ్ర అసమ్మతి ఎదుర్కొన్నది. ప్రతిపక్ష టీడీపీ కంటే.. సొంత పార్టీ నేతల నుంచి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొవాల్సి వచ్చింది. దాంతో ఎన్నికల ముందే ఆమెకు కఠిన పరిస్థితులు ఎదుర్కోబోతున్నట్టు అభిప్రాయం వ్యక్తమైంది.
అయితే తాజా ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత స్వయంగా రోజా మాట్లాడుతూ.. నాకు టీడీపీ నుంచి కాకుండా వైసీపీ నేతల నుంచి తీవ్ర అసమ్మతిని ఎదుర్కొన్నాను అంటూ మీడియా ముందు వాపోయింది. దాంతో ఆమె స్వయంగా తన విజయంపై చేతులు ఎత్తేసిందనే అభిప్రాయం వ్యక్తమైంది.

తాజాగా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. నగరి అసెంబ్లీ స్థానం నుంచి రోజా ఓటమి చెందతున్నారనే విషయం పలు సంస్థలు వెల్లడించాయి. ఈ స్థానంలో రోజా గెలవడం అసాధ్యం.. ఒకవేళ గెలిస్తే ఏడో వింతగా చెప్పుకోవచ్చనే విధంగా విశ్లేషకులు సెటైర్ వేస్తున్నారు. దాంతో నగరిలో రోజా గెలుపు రేసులో వాడి పోవడం ఖాయమని చెప్పుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











