Andhra Pradesh Exit Polls 2024: పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం పక్కా.. రికార్డు విజయం దిశగా జనసేనాని
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రాలో గెలుపు బాటలో పయనించేది ఎవరనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. పలు చోట్ల హింసాత్మకంగా, మరికొన్ని చోట్ల రసవత్తరంగా, మరికొన్ని చోట్ల పోటాపోటీగా ఎన్నికలు జరిగాయి. అయితే ఏపీలో ప్రధానంగా పిఠాపురంపై ప్రపంచవ్యాప్తంగా దృష్టి సారించారు. అయితే ఈ స్థానం నుంచి ఎవరు విజయం సాధిస్తుందనే విషయంపైఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విషయాలు ఏమిటంటే?
అధ్యాత్మిక నగరం పిఠాపురం అసెంబ్లీ నియోజవకవర్గం అత్యంత ఆసక్తిని రేపిన స్థానంగా ప్రత్యేకంగా నిలిచింది. ఈ స్థానం నుంచి వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేయగా.. ఆమెకు పోటీగా పవన్ కల్యాణ్ జనసేన అభ్యర్థిగా నిలిచారు.

అయితే తాజాగా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ భారీ విజయం సాధిస్తున్నారు అని చెప్పారు. దాంతో పవన్ కల్యాణ్ రికార్డు మెజారిటీ సాధించే అవకాశం ఉంది అని పలు సంస్థలు వెల్లడించాయి.
గతంలో పవన్ కల్యాణ్ తొలిసారి గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. తాజాగా ఆ రెండు స్థానాల నుంచి కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేయడం తెలిసిందే. ఈ స్థానంలో అభిమానులు, భారీగా ప్రచారం చేసి ఆయన విజయానికి కృషి చేశారు.

అయితే ఈ స్థానం నుంచి పవన్ కల్యాణ్ ఏ రేంజ్ మెజారిటీ సాధిస్తుందనే విషయంపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ స్థానం నుంచి 30 వేలకుపైగా మెజారిటీ సాధించే అవకాశం ఉందనే విషయాన్ని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.


Click it and Unblock the Notifications











