AP Exit Polls 2024: పవన్ కల్యాణ్, బాలకృష్ణ, రోజాలో.. గెలుపు ఎవరిది? ఓటమి ఎవరిది?
దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ ముగింపునకు చేరుకొన్నది. జూన్ 1వ తేదీన దేశవ్యాప్తంగా ఏడు దఫాలుగా ఓట్ల పండుగ ముగియడంతో ఇప్పుడు అందరి ఆసక్తి ఏ పార్టీ విజయం సాధిస్తుంది? ఏ రాజకీయ నేత విజయం సాధిస్తున్నారనే విషయంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతున్నది. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా దృష్టి నెలకొన్నది. ఈ క్రమంలో అసెంబ్లీ బరిలో నిలిచిన సినీ ప్రముఖులు గెలుపు ఓటముల తీరుపై ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి వివరాలు అందించనున్నాయనే విషయంలోకి వెళితే..
ఏపీ అసెంబ్లీలో సినీ ప్రముఖులు తమ రాజకీయ భవిష్యత్తును తేల్చుకొనేందుకు రంగంలోకి దిగారు. తెలుగు దేశం పార్టీ తరఫున నందమూరి బాలకృష్ణ మూడోసారి హిందూపూర్ నుంచి బరిలోకి దిగారు. ఇక రోజా నగరి నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మూడోసారి ఆమె నగరి నుంచి బరిలోకి దూకారు.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీలో ఉన్నారు. ఆమె ప్రత్యర్థి వంగ గీత తన విజయంపై ఎప్పుడో ఆశలు వదిలేసుకొన్నారు. గతంలో పవన్ రెండు చోట్లు అంటే.. గాజువాక, భీమవరం నుంచి పోటీలో ఉండి రెండు అసెంబ్లీ స్థానాల్లో ఓటమిపాలైయ్యారు. దాంతో పవన్ కల్యాణ్ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా అభిమానులు తీసుకోవడం విశేషంగా మారింది.

ఇక సినీ పరిశ్రమ నుంచి మరో ప్రముఖుడు మార్గాని భరత్ కూడా వైసీపీ తరఫున బరిలోకి దిగారు. ఆయన గతంలో ఓయ్ నిన్నే అనే సినిమాలో నటించారు. కాలేజీ డేస్‌లో ఆయన మోడలింగ్ కూడా చేశారు. అనంతరం ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి..2019లో రాజమండ్రి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
అయితే తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ విజయం సాధించబోతున్నారు అని పలు సర్వేలు, ఎగ్జిట్ పోల్ సంస్థలు వెల్లడించాయి.
ఇక హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ హ్యట్రిక్ విజయం సాధించబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఆయన గెలుపు భారీగా ఉంటుందని సర్వేలు వెల్లడించాయి.
ఇక చిత్తూరు జిల్లాలో నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఓటమి చెందుబోతున్నారనే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











