twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆన్ లైన్ టికెటింగ్ వ్యవహారంలో మరో ట్విస్ట్.. ఏపీ ప్రభుత్వం కొత్త వ్యూహం!

    |

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటిలో టికెట్ రేట్ల పెంపు ఉండే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా అదే నిజం కాదని అనిపించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

    ఆన్లైన్ చేశాకే క్లారిటీ

    ఆన్లైన్ చేశాకే క్లారిటీ


    ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు ఆన్‌లైన్ టిక్కెట్ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబడుతున్న విషయం మనకు తెలిసిందే. పోర్టల్ లైవ్ అయిన తర్వాత మాత్రమే టికెట్ రేట్ల విషయంలో ఇప్పటివరకు వివాదాస్పదంగా ఉన్న సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం సూచించింది. పరిశ్రమ పెద్దలు సైతం ఈ సమస్య నుంచి బయట పడడానికి వేరే మార్గం లేకపోవడంతో ఈ ప్రతిపాదనకు అంగీకరించినప్పటికీ, ఏర్పాటు కానున్న వ్యవస్థపై వారి భయాలు వారికి ఉన్నాయి.

    ప్రొడ్యూసర్స్ ఆశించారు కానీ

    ప్రొడ్యూసర్స్ ఆశించారు కానీ

    ఈ పోర్టల్ పని ప్రారంభించే ముందు ఈ పోర్టల్ యొక్క పూర్తి పద్ధతులను ప్రభుత్వం బహిరంగపరచాలని వారు ఆశించారు. అయితే, అలాంటి విషయాల్లో ఎలాంటి స్పష్టత లేకుండా, ప్రభుత్వం ఈ కొత్త వ్యవస్థకు సంబంధించిన పనిని ప్రారంభించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని థియేటర్లకు పోర్టల్‌లో పొందుపరచాల్సిన వివిధ వివరాలను సేకరిస్తూ ఫారమ్‌లను పంపారు. పోర్టల్ అభివృద్ధి పూర్తయిన తర్వాత, థియేటర్ల యజమానులు అందించిన వివరాలు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడతాయి.

    ఆ సమాచారం అంతా పోర్టల్ లో

    ఆ సమాచారం అంతా పోర్టల్ లో

    థియేటర్ యజమానులు అందించబడిన సమాచారం అంతా ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయ బడుతుంది. ఈ తతంగం అంతా కనీసం డిసెంబర్‌లో పుష్ప విడుదల సమయానికి పూర్తవుతుందని పరిశ్రమ పెద్దలు ఆశిస్తున్నారు. అయితే, వచ్చే ఏడాది వేసవి నాటికి మాత్రమే ప్రభుత్వం కసరత్తును పూర్తి చేయగలదనే పుకార్లు కూడా ఉన్నాయి. అటువంటప్పుడు, టాలీవుడ్ లో చాలా సినిమాల వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

    సినిమా రిలీజ్ డేట్ల విషయంలో కన్ఫ్యూజన్?

    సినిమా రిలీజ్ డేట్ల విషయంలో కన్ఫ్యూజన్?


    నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్, బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ, అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా కూడా డిసెంబర్ నెలలో విడుదల కావాల్సి ఉంది. టికెట్ రేట్లు గురించి క్లారిటీ రాకుండా ఉంటే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ సినిమాలు జనవరి నెలలో విడుదల చేసే అవకాశాలు ఉంటాయి అదే గనుక జరిగితే జనవరిలో ఇప్పటికే రిలీజ్ డేట్ లో ప్రకటించుకున్న సినిమాల విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

    మంచు విష్ణు రికమండేషన్?

    మంచు విష్ణు రికమండేషన్?


    ఈ నేపథ్యంలోనే త్వరలోనే ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆధ్వర్యంలో ఒక భేటీ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా ఈ టికెట్ రేట్ల పెంపు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోమని కోరాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన సందర్భంగా ఆయనకు జగన్ స్వయాన బావ అవుతారు, దీంతో ఆయన చేత కూడా టికెట్ రేట్ల పెంపు విషయం మీద ఒక సారి అడిగించే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది.

    English summary
    Andhra Pradesh Government asked few details from theatres for finalising online ticketing portal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X