ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. కల్కి సినిమాకు మరో బంపర్ ఆఫర్!
కల్కి సినిమా నిర్మాతకు, అలాగే ప్రభాస్ అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. ఇప్పటి వరకు 5 షోలకు పర్మిషన్ ఇచ్చిన ఏపీ సర్కారు తాజాగా మరో నిర్ణయం తీసుకొన్నది. ఇప్పటికే టికెట్ రేట్లను పెంచుతూ జీవోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నిర్మాతల అభ్యర్థన మేరకు సినిమాటోగ్రఫి మంత్రిత్వశాఖ మరో వెసలుబాటును కల్పించింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఏపీలో గత ప్రభుత్వం అవలంభించిన విధానాలను దృష్టిలో పెట్టుకొన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సినీ పరిశ్రమకు సానుకూలమైన నిర్ణయాలను ప్రకటించింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద చిత్రంగా రూపొందిన కల్కి 2898ఏడీ సినిమాకు అడిగిన వెంటనే 5 షోలు ప్రదర్శించుకొనే విధంగా అలాగే.. టికెట్ రేట్లను భారీగా పెంచుకొనే విధంగా అనుమతి ఇచ్చింది.

ఇక తాజాగా కల్కి సినిమాకు ఉన్న పబ్లిక్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని మరో షోను పెంచాలని వైజయంతీ మూవీస్ బ్యానర్, సీ అశ్వినీదత్ అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించింది. ఈ సినిమాకు 6వ షోకు కూడా అనుమతిస్తూ జీవోను జారీ చేసింది. ఇందుకు చిత్ర యూనిట్ ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.
అయితే ఏపీలో కల్కికి 6వ షోను ప్రదర్శించుకోనేలా అనుమతి ఇచ్చాం. ఈ షోను ఉదయం 4.30 గంటల నుంచి 8 గంటల వరకు ప్రదర్శించుకోవచ్చు. ఇది తాత్కాలికంగా ఇచ్చిన అనుమతి.. కానీ ఈ అనుమతి కేవలం 1 రోజు మాత్రమే అని జీవోలో స్పష్టంగా తెలియజేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లకు ఈ సమాచారాన్ని చేరవేసింది. తగు రీతిలో పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని సూచించింది.

ఇదిలా ఉండగా, కల్కి 2998 సినిమాను సుమారుగా 600 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాలో ఉలగనయగన్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, దీపికా పదుకొనె, మాళవిక నాయర్ ఇంకా రూమర్స్ ప్రకారం మృణాల్ ఠాకూర్, నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు కూడా నటిస్తున్నారని కొన్ని రూమర్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications











