twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీకి మరో టెన్షన్.. పొద్దుపోయాక టికెట్ల కొత్త జీవో జారీ.. అంతా గందరగోళం!

    |

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో టాలీవుడ్ లో కొత్త టెన్షన్ మొదలైంది. నిజానికి కొద్ది రోజుల క్రితం విడుదలైన వకీల్ సాబ్ సినిమా సమయంలో టికెట్ రేట్లను భారీగా తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ అంశానికి సంబంధించి మరో జీవో జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.

    వకీల్ సాబ్ దెబ్బ

    వకీల్ సాబ్ దెబ్బ

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ సినిమా సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షో లు అన్ని క్యాన్సిల్ చేయడమేకాక టికెట్ రేటు పెంచి అమ్ముకునే అవకాశాన్ని కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక భారీగా టికెట్ రేట్లు తగ్గించి ఒక జీవో కూడా జారీ చేసింది.

    సినీ పెద్దల కారణంగా

    సినీ పెద్దల కారణంగా

    వకీల్ సాబ్ సినిమా తర్వాత పెద్ద సినిమాలేవీ విడుదల కాకపోవడం అప్పట్లో పెద్ద సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు లేకపోవడంతో సినీ పెద్దలు కూడా ఈ విషయంలో మిన్నకుండిపోయారు. కానీ ఇప్పుడు మళ్లీ థియేటర్లు ఓపెన్ చేసే సమయం దగ్గర పడటంతో పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కి సిద్ధమవుతుండడంతో కొద్దిరోజులుగా ఏపీ ప్రభుత్వంతో సినీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారు.

    కొత్త జీవో

    కొత్త జీవో

    తాజాగా సంప్రదింపులు ఫలించి నిన్న పొద్దుపోయాక ఒక జీవో జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాజాగా సినిమాల్లో వివిధ కేటగిరీల కింద టికెట్ల ధర నిర్ణయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సినిమా నియంత్రణ చట్టం 1955 ప్రకారం జారీ చేసినప్పటికీ 1273 జీవో సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జీవో అయితే కాస్త గందరగోళంగానే కనిపిస్తోంది.

    జీవోలో ఏముందంటే

    జీవోలో ఏముందంటే

    కానీ క్లుప్తంగా చూసుకున్నట్లయితే ఈ జీవోలో పేర్కొన్న దాని ప్రకారం టికెట్ రేట్లు మళ్ళీ పెంచుకోవచ్చని అయితే రేటు తగ్గించడం, పెంచడం మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుందని ఆయా సందర్భాలను బట్టి ప్రభుత్వమే టికెట్ ధరలను నిర్ణయిస్తుందని జీవోలో పేర్కొంది.. కాస్త గందరగోళంగా ఉన్నా పెద్ద సినిమాల విషయంలో తెలుగు నిర్మాతలకు ఇది మంచి అవకాశం దొరికిందని చెప్పవచ్చు.

    అంటే ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమా హళ్లలోని వివిధ కేటగిరీల టికెట్ ధరల్ని నిర్ణయించనుంది, థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు దాని మీద హక్కులు ఉండవు.

    Recommended Video

    Anandayya మందు పై గళం విప్పుతున్న Tollywood ప్రముఖులు || Filmibeat Telugu
    మళ్లీ ఏమైనా అడ్డంకులు

    మళ్లీ ఏమైనా అడ్డంకులు

    అయితే మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమా సమయానికి ప్రభుత్వం ఏమైనా అడ్డంకులు సృష్టిస్తుందా? లేదా అనే చర్చ కూడా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నారు దర్శక నిర్మాతలు. సో మళ్లీ సంక్రాంతి టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటే పవన్ ఫాన్స్ ఆగ్రహానికి గురికాక తప్పదని చెబుతున్నారు.

    English summary
    Andhra Pradesh in a major relief to the industry has decided to do away with the controversial G.O. restricting film ticket prices to the rates of 2011. it released a new GO.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X