RRRకి గుడ్ న్యూస్.. రేట్లు పెంచుకోవడానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. కానీ అక్కడే సస్పెన్స్?

చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్న సినిమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ విడుదల కాగా ఇక RRR కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు RRR గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమా టికెట్ రేట్ల విషయమై రీసెంట్‌గా ఏపీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన రాజమౌళి.. సీఎంకు తన సినిమా టికెట్ రేట్లు పెంచమని కోరారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ఈ విషయం మీద గుడ్ న్యూస్ చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే

సీఎం చూసి ఫైనల్

సీఎం చూసి ఫైనల్

RRR సినిమాకు ఎట్టకేలకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఇకపై రెమ్యూనేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్‌ దాటిన సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నామని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ RRR టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు మూవీ నిర్మాత దరఖాస్తు చేశారని.. పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. దాన్ని సీఎం చూసి ఫైనల్ చేస్తారని అన్నారు.

జీవోలో పేర్కొన్నామని

జీవోలో పేర్కొన్నామని

ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని.. మొదటి 10 రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని ఆయన వెల్లడించారు. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఐదు షోలు వేయడానికి తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, పెద్ద సినిమాలు విడుదల సమయంలో చిన్న సినిమాలు కూడా ఉంటే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు ఒక షో చిన్న సినిమాలకు కేటాయించాలని జీవోలో పేర్కొన్నామని అన్నారు.

సింగిల్ విండోలో

సింగిల్ విండోలో

ఇక రెమ్యూనేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్‌ దాటిన సినిమాలను భారీ బడ్జెట్ సినిమాలు అంటుంటే 20 కోట్ల కంటే తక్కువ ఉన్నవన్నీ చిన్న సినిమాలే అని ఆయన అన్నారు. ప్రభుత్వ కొత్త ఆదేశాల ప్రకారం, సినిమాల్లో 20 శాతం ఆంధ్ర రాష్ట్రంలో షూట్ చేయాల్సి ఉందని అన్నారు. ఇక షూటింగ్ విషయం గురించి మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతానికి సబ్సిడీ ఏమీ లేదని.. అనుమతి మాత్రం సింగిల్ విండోలో వేగంగా ఇస్తున్నామన్నారు.

మధ్యేమార్గంగా

మధ్యేమార్గంగా

ఇక నిర్మాణ సంస్థలు సినిమాలు విడుదల చేసిన మూడు నాలుగు రోజుల్లో పెట్టిన డబ్బులు తిరిగి రావాలని విపరీతంగా టికెట్ల రేట్లు పెంచే సంస్కృతి ఉందని, ఒకవేళ అలా చేస్తే ప్రజలపై భారం పడుతుందని భావించి తమ ప్రభుత్వం మధ్యేమార్గంగా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఆన్‌లైన్‌ టికెట్‌ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని.. ఈ ప్రక్రియ నిర్వహించడానికి రెండు కంపెనీలు టెండర్లు వేశాయని తెలిపారు. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని మంత్రి నాని చెప్పారు.

Recommended Video

RRR Movie బాహుబలి రేంజ్ లో ఆడాలంటే.. | AP Ticket Price || Filmibeat Telugu
336 కోట్ల బడ్జెట్

336 కోట్ల బడ్జెట్

రాజమౌళి దర్శకవంలో తెరకెక్కిన RRR సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక అలియా భట్, ఒలీవియా మోరిస్ లో ఫిమేల్ లీడ్స్ గా నటించారు. అలాగే అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రేయ, రాజీవ్ కనకాల కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో రెమ్యునరేషన్స్ కాకుండా 336 కోట్ల బడ్జెట్ అయినట్టు ప్రభుత్వానికి RRR నిర్మాతలు చేసిన దరఖాస్తులో పేర్కొన్నారు. ఆ మేరకు బిల్లులు కూడా సమర్పించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X