జైల్లో పోసాని అలాంటి డ్రామాలు.. మండిపడ్డ రైల్వే కోడూరు సీఐ
ప్రజల్లో వర్గ వైషమ్యాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలతో అరెస్ట్ చేసిన పోసాని కృష్ణమురళిని 14 రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. మీడియాలో ప్రెస్‌మీట్‌లో పలువురు ప్రముఖులపై అనుచిత, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనపై ఆంధ్రప్రదేశ్‌లోని 16 ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఆయన ఇటీవల హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి కడపకు తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారిందనే ఫిర్యాదుతో ఆయన హాస్పిటల్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన గురించి రైల్వే కోడూరు సీఐ మండిపడ్డారు. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
కొద్ది రోజుల క్రితం రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్‌లోని మై హోం భుజా అపార్ట్‌మెంట్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకొన్నారు. వెంటనే ఆయనను ఏపీలోని కడపకు తరలించారు. సుదీర్ఘంగా సాగిన వాదనల తర్వాత కడప స్థానిక కోర్టు ఆయను 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.

అయితే తనకు ఛాతీలో నొప్పి అంటూ జైలు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను రైల్వే కోడూరులోని హాస్పిటల్‌కు తరలించారు. ఆయన కోరిక మేరకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షల్లో ఎలాంటి సమస్యలు లేకపోవడంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు. వైద్య పర్యవేక్షణలో ఆయన ఆరోగ్యంపై దృష్టిపెట్టారు.
పోసాని ఆరోగ్య పరిస్థితిపై రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు మీడియాలో స్పందించారు. ఆయన ఛాతీ నొప్పి అంటూ మా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తరలించి నిపుణులైన వైద్యులతో పరీక్షలు జరిపించాం. ఆయన అడిగిన అన్ని వైద్య పరీక్షలు చేయించాం. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించారు. దాంతో ఆయనను జైలుకు తిరిగి తీసుకొచ్చాం అన అన్నారు.

ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం, ఛాతీ నొప్పి అంటూ పోసాని డ్రామాలు ఆడుతున్నారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. కావాలనే జైలు అధికారులతో నాటకాలు ఆడుతున్నారు. ఇలాంటి చర్యలు ఆయనకు తగవు. జైలు అధికారులకు సహకరించాలి అని సీఐ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు.


Click it and Unblock the Notifications











