అరవింద సమేతకు ఇక అడ్డు లేదు.. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ తొలి కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రంపై అంచనాలు నెలకొని ఉన్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందడంతో ఆసక్తి నెలకొంది.

ఎన్టీఆర్ అభిమానులకు, అరవింద సమేత చిత్ర యూనిట్ కు సంతోషాన్ని కలిగించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదలయ్యే 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రోజుకు 6 షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్యలో రెండు ప్రత్యేకమైన షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చింది. దసరా సెలవులు కూడా కలసి రానుండడంతో అరవింద సమేత చిత్రం భారీ వసూళ్లు సాధించేందుకు అంతా సిద్ధం అయింది.

AndhraPradesh Govt has granted permission for 2 extra shows for AravindhaSametha

ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు విలన్ పాత్రలో నటించగా, నాగబాబు కీలకమైన పాత్రలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X