SAINDHAV: వెంకటేష్‌కు జోడీగా హాట్ బ్యూటీ.. ఇద్దరితో ఆ సీన్స్ ప్లాన్ చేస్తున్నారట
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నారు విక్టరీ వెంకటేష్. చాలా కాలం పాటు ఫ్యామిలీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఈ మధ్య కాలంలో ప్రయోగాలు చేస్తోన్నారు. గత ఏడాది 'ఎఫ్3' చిత్రంతో వచ్చి అదిరిపోయే కామెడీని పండించారు. ఈ క్రమంలోనే ఇటీవలే 'రానా నాయుడు' వంటి వెబ్ సిరీస్‌తో వచ్చి.. తనలోని కొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక, ఇప్పుడు ఆయన మరో సినిమాను చేయడానికి సన్నద్ధం అవుతున్నారు.
ఈ మధ్య కాలంలో సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన విక్టరీ వెంకటేష్.. ఇప్పుడు 'హిట్' ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలనుతో 'సైంధవ్' అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేశారు. ఇందులో కంటైనర్లు ఉన్న ఒక ప్రదేశంలో చేతిలో ఒక బయో డ్రగ్‌ను పట్టుకుని నడుచుకుంటూ కనిపించడం.. ఆ తర్వాత దానితో దాడి చేసేందుకు కంటైనర్‌లో గన్‌ను వెతికి తీసుకు రావడం వంటివి చూపించారు. దీంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

క్రేజీ కాంబినేషన్‌లో సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న 'సైంధవ్' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం కోసం ఎన్నో ఇండస్ట్రీల నటీనటులను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇందులో వెంకటేష్‌కు జోడీగా కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జెరోమియాను ఎంపిక చేశారని తాజాగా తెలిసింది. అంతేకాదు, వీళ్లిద్దరి కాంబినేషన్‌లో కొన్ని యాక్షన్ సీన్స్‌ను కూడా ప్లాన్ చేశారని అంటున్నారు. గతంలో ఆమె అలాంటి తరహా పాత్రలు చేయడం వల్లే ఈ చిత్రానికి తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. వెంకటేష్ - శైలేష్ కొలను కాంబోలో రాబోతున్న 'సైంధవ్' మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.


Click it and Unblock the Notifications











