SAINDHAV: హాట్ బ్యూటీతో వెంకటేష్ రచ్చ.. ముగ్గురి హీరోయిన్లలో ఈమెతోనే ఆ సీన్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు దగ్గుబాటి వెంకటేష్. విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన.. గతంలో మాదిరిగా ఇప్పుడు వేగంగా సినిమాలు చేయడం లేదు. ఈ క్రమంలోనే గత ఏడాది 'ఎఫ్3' చిత్రంతో వచ్చి అదిరిపోయే కామెడీని పండించిన వెంకటేష్.. ఇటీవలే 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌తో కొత్తగా వచ్చి విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ ఇప్పుడు అదిరిపోయే పాన్ ఇండియా మూవీలో భాగం అయిపోయారు.
సరైన సోలో హిట్ కోసం సుదీర్ఘ కాలంగా వేచి చూస్తోన్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం 'హిట్' ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలనుతో 'సైంధవ్' అనే సినిమా చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేశారు. దీంతో ఆరంభంలోనే దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఉండేలా చేశారు. ఇక, ఇటీవలే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. అంతేకాదు, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు కూడా చిత్రీకరణను బ్రేకులు లేకుండా జరుపుతున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'సైంధవ్' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం కోసం ఎన్నో ఇండస్ట్రీల నటీనటులను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు హాట్ బ్యూటీ ఆండ్రియా జెరోమియాను 'జాస్మిన్' అనే పాత్ర కోసం ఎంపిక చేశారు. తాజాగా ఆమె ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో ఆమె చేతిలో ఓ గన్ పట్టుకుని కనిపించింది. ఈమెతో కలిసే వెంకటేష్ యాక్షన్ సీన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ చిత్రంతో ఆడ్రియా కాకుండా శ్రద్దా శ్రీనాథ్, రుహానీ శర్మలు కూడా నటిస్తోన్నారు. ఇప్పటికే వాళ్ల పోస్టర్లు విడుదల చేశారు.

ఇదిలా ఉండగా.. వెంకటేష్ - శైలేష్ కొలను కలయికలో రాబోతున్న 'సైంధవ్' మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











