బెజవాడ పేరు చెప్పగానే అందరికీ అమ్మవారు గుర్తొస్తే.. అనిల్ రావిపూడికి మాత్రం అదే గుర్తొస్తుందట!

సత్యదేవ్ హీరోగా రాబోతున్న తాజా సినిమానే కృష్ణమ్మ. వి.వి గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 10వ తేదీన విడుదల కాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. ప్రముఖ డైరెక్టర్లు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి, అనిల్ రావిపూడి, కొరటాల శివ, గోపీచంద్ మలినేనిలు వచ్చారు. ఈక్రమంలోనే మీకు బెజవాడ అనగానే ఏం గుర్తుకు వస్తుందంటూ యాంకర్ అడగ్గా.. ఒక్కొక్కరూ ఒక్కో సమాధానం చెప్పారు. అందరూ చెప్పిన ఆన్సర్లు ఒకలా ఉంటే.. అనిల్ రావిపూడి మాత్రం కాంట్రవర్షియల్ కామెంట్లు చేశారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్ అదిరిపోయే సినిమాలతో వస్తున్నారు. గతేడాది గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించి మెస్మైరైజ్ చేసిన ఈయన తాజాగా కృష్ణమ్మ అనే సినిమా చేస్తున్నాడు. హీరోగా మారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అయ్యాడు. ముఖ్యంగా మే 10వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈక్రమంలోనే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బెజవాడలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కు యాంకర్ శ్యామల హోస్ట్ గా చేసింది.

Ani Ravipudi Shocking Comments About Bejawada Check Details

ఈక్రమంలోనే అతిథులుగా అక్కడకు వచ్చిన ప్రముఖ డైరెక్టర్లకు పలు ప్రశ్నలు అడిగింది. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, కొరటాల శివ, గోపీచంద్ మలినేని, అనిల్ రాలిపూడిలు ఇక్కడకు వచ్చి తెగ సందడి చేశారు. సినిమా గురించి మాట్లాడారు. అలాగే హీరోహీరోయిన్లతో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్లపై కూడా ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలవాలని కోరుకుంటూ ఈవెంట్ లో ఒక్కొక్కరూ మాట్లాడుతూ.. సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ సందర్భంగానే యాంకర్ శ్యామల మాట్లాడుతూ.. బెజవాడ అనే పేరు వినగానే మీకు ఏం గుర్తుకు వస్తుందంటూ డైరెక్టర్లను అడిగింది.

శ్యామల అడిగిన ప్రశ్నకు జక్కన్న స్పందించి... బెజవాడ అనగానే తనకు అమ్మవారు గుర్తుకు వస్తారని చెప్పారు. ఇక ఆ తర్వాత ఇదే ప్రశ్నను పక్కనే ఉన్న కొరటాల శివను అడిగారు. అయితే రాజమౌళి చెప్పిన సమాధానం కాకుండా ఇంకేదైనా కొత్తగా చెప్పాలని అనగా.. వెంటనే ఆయన బ్యారేజీ గుర్తుకు వస్తుందని వివరించారు. ఈయన కూడా సమాధానం చెప్పగా.. ఇదే ప్రశ్నను డైరెక్టర్ గోపీచంద్ మలినేనిని అడిగింది. దీనికి ఆయన స్పందిస్తూ.. నాక్కూడా అమ్మవారే గుర్తుకు వస్తారని అన్నారు. లేదు ఇంకేదైనా కొత్తగా చెప్పాలని అనగా.. అలా కాదండీ నాకు అమ్మవారే గుర్తుకు వస్తారు, ఇక్కడికొచ్చిన ప్రతీసారి నేను అమ్మవారిని దర్శించుకుంటానంటూ చెప్పుకొచ్చాడు గోపీచంద్ మలినేని.

ఇక చివరగా ఇదే ప్రశ్నను.. డైరెక్టర్ అనిల్ రావిపూడికి అడిగింది. అయితే ఏదైనా కొత్తగా చెప్పమంటున్నారు కాబట్టి.. కాంట్రవర్షియల్ కామెంట్లు చేద్దాం అంటూ అన్నాడు. దీనికి శ్యామల మాక్కూడా అదే కావాలంటూ అనగా.. అనిల్ రావిపూడి ఇది నేను చెప్పిన డైలాగ్ కాదని, డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పారని చెబుతూ... బెజవాడ అనగానే తనకు పైన అమ్మవారు, కింద కమ్మవారు అనే డైలాగ్ గుర్తుకు వస్తుందని అన్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X