అడగ్గానే వస్తున్నందుకు థ్యాంక్స్.. రామ్‌పై అనిల్ రావిపూడి కామెంట్స్
అనిల్ రావిపూడి ఇప్పుడు కొత్త అవతారమెత్తాడు. నిర్మాతగా మారి ఓ సినిమాను నిర్మించాడు. తానే కథ, మాటలు అందించి.. దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ సమర్పిస్తోన్న గాలి సంపత్ సినిమా కోసం అనిల్ రావిపూడి బాగా కష్టపడుతున్నాడు. తనకున్న పరిచయాలతో సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేస్తున్నాడు. రాజమౌళి, నాని, విజయ్ దేవరకొండ ఇలాంటి స్టార్స్‌తో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాడు.
ఇక వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం జరగబోతోంది. జేఆర్సీ కన్వెన్షన్‌లో మార్చి 7 జరగబోతోన్న ఈ ఈవెంట్‌కు ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు. అయితే శ్రీ విష్ణు కోసమే ఇలా గెస్ట్‌గా రాబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి ఉన్నదీ ఒకటే జిందగీ అనే సినిమాలో కలిసి పని చేశారు.అయితే రామ్ ఇలా తమ సినిమాకు సాయం అందిస్తోండటంపై అనిల్ రావిపూడి స్పందించాడు.

అడగ్గానే ఇలా మా సినిమా కోసం వస్తోన్న రామ్ గారికి ధన్యావాదాలు అంటూ అనిల్ రావిపూడి ఓ పోస్ట్ చేశాడు. మొత్తానికి ఇండస్ట్రీలోని స్టార్స్‌ను గాలి సంపత్ కోసం అనిల్ రావిపూడి తీసుకొచ్చి గట్టిగానే ప్రమోట్ చేశాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసేశారు. ఇక ఈ మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిర్మాతగానూ అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యేట్టున్నాడు.


Click it and Unblock the Notifications











